మానవుల్లో శిలీంద్రాల వల్ల వచ్చే వ్యాధులు
తామర (రింగ్ వార్మ్స్) | |
» 'మైక్రోస్పోరియం ట్రైకోఫైటన్' అనే శిలీంద్రం ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తుంది. | |
» అపరిశుభ్ర పరిసరాలు, వ్యాధి సోకిన రోగి వాడిన వస్తువుల ద్వారా, పిల్లులు, కుక్కల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. | |
» ఈ వ్యాధి వల్ల ఎర్రగా, ఉబ్బెత్తుగా ఉండే పుండ్లు చిన్నవిగా, గుండ్రంగా మొదట శరీరంపై ఏర్పడి క్రమేణా పెద్దవిగా మార్పు చెంది మచ్చలుగా ఏర్పడతాయి. | |
దోబీఇచ్ | |
» అనేక రకాల శిలీంద్రాలు ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తాయి. | |
» ఈ వ్యాధి సోకిన వ్యక్తి వాడిన వస్తువుల్ని ఉపయోగించడం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. | |
» ఈ వ్యాధి వల్ల తొడలు, గజ్జలపై దురద, ఎర్రని పొక్కులు ఏర్పడతాయి. | |
మదురాపాదం | |
» 'మిరెల్లా మైసిటోమి' అనే శిలీంద్రం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. | |
» శరీరంపై ఏదైనా గాయమైనప్పుడు ఈ గాయం ద్వారా ఈ శిలీంద్రం మానవుడిలోకి ప్రవేశిస్తుంది. | |
» ఈ వ్యాధి పాదాలకు, మడమలకు సోకి లోతైన పుండ్లు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో అంగవైకల్యానికి దారి తీసే పరిస్థితులు కూడా తలెత్తుతాయి. | |
అథ్లెట్ పాదం | |
» 'ట్రైకోఫైటాన్' అనే శిలీంద్రం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. | |
» ఈ వ్యాధి ఎక్కువగా తడి ప్రదేశాల్లో సంచరించే వారికి వస్తుంది. | |
» తడిగా ఉండే చర్మంపై ఈ శిలీంద్రం తన ప్రభావాన్ని చూపిస్తుంది. | |
» వ్యాధి సోకిన ప్రాంతంలో మంట పుట్టడం, కాలి వేళ్ల మధ్య పగిలి రక్తస్రావమవడం జరుగుతాయి. * న్యూరైటిస్ అనే వ్యాధికి 'మ్యూకార్ ఫ్యూజిల్లస్' అనే శిలీంద్రం కారకంగా పనిచేస్తుంది. * బ్లాస్టోమైకోసిస్ వ్యాధికి 'బ్లాస్టోమైసిస్ డెర్మటైడిస్' అనే శిలీంద్రం కారకమవుతుంది. * డెర్మటోమైసిస్, మొనిలియాసిస్, కాండీడియాసిస్ వ్యాధులకు 'కాండిడా ఆల్బికాన్స్' అనే శిలీంద్రం కారకమవుతుంది. * మెనెంజైటిస్ వ్యాధికి 'మైక్రోస్పోరమ్', 'ట్రైకో ఫైటాన్' అనే శిలీంద్రాలు కారణమవుతాయి. * హిస్టోప్లాస్మోసిస్ వ్యాధికి 'హిస్టోప్లాస్మా కాప్యులేటమ్' అనే శిలీంద్రం కారణం. * క్రిప్టో కాకోసిస్ వ్యాధికి 'లైఫోమైసిస్ నియోపార్మాన్స్' అనే శిలీంద్రం కారకమవుతుంది. * ఓటోమైసిస్ అనే వ్యాధికి 'కాండిడా ఆల్బికాన్స్', 'ఆస్పర్జిల్లస్' శిలీంద్ర జాతులు కారణమవుతాయి. |