మానవుల్లో బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు

 న్యూమోనియా » ఈ వ్యాధి 'డిప్లోకోకస్ న్యూమోనియా' అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. » బ్యాక్టీరియా ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లోకి ప్రవేశిస్తుంది. » దీనికి గాలి ప్రధాన వాహకంగా పనిచేస్తుంది. వ్యాధి లక్షణాలు: ఛాతీలోనూ, పొత్తి కడుపులో నొప్పి; చలి, కామెర్లు, ఎగశ్వాస. ధనుర్వాతం » ఇది 'క్లాస్ట్రీడియమ్ టెటాని' అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది.


» ఈ వ్యాధిని 'టెటానస్' అని కూడా అంటారు.» తుప్పు పట్టిన మేకులు, తీగలు శరీరానికి గుచ్చుకున్నా లేదా గీసుకున్నా.. ఈ వ్యాధి జనకాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి.» శరీరంపై ఏర్పడిన గాయాల ద్వారా కూడా ఈ వ్యాధి జనకాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. » కండరాలు, నరాలు ఈ వ్యాధికి గురవుతాయి. వ్యాధి లక్షణాలు: » కండరాలు ముడుచుకొనిపోతాయి. నరాల తీపులు, శరీరం విల్లు ఆకారంలో వంగుతుంది. » వ్యాధి సంక్రమణ కాలం 2 నుంచి 40 రోజుల వరకు ఉంటుంది. కలరా » ఇది 'విబ్రియో కలరా' అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది.


» ఈగలు, దోమలు, కలుషిత ఆహారం, నీరు, మలం ...... వ్యాధి వాహకాలుగా పనిచేస్తాయి.వ్యాధి లక్షణాలు:» వాంతులు, నీళ్ల విరేచనాలు, మూత్రం ఆగిపోవడం, కండరాల నొప్పులు, కళ్లు మండటం. » ఈ వ్యాధి వల్ల డీహైడ్రేషన్ ఎక్కువగా జరుగుతుంది. » డీహైడ్రేషన్‌ను నివారించడానికి ఓఆర్ఎస్ (ORS: Oral Rehydration Solution) ద్రావణాన్ని ఇస్తారు. » వ్యాధి సంక్రమణ కాలం 1 - 2 రోజులు మాత్రమే ఉంటుంది. కుష్ఠు (లెప్రసీ) » ఇది 'మైకో బ్యాక్టీరియమ్ లెప్రె' అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది.

» ఈ వ్యాధిని హాన్‌సన్ వ్యాధి అని కూడా అంటారు.» వ్యాధి సోకిన వ్యక్తులతో దీర్ఘకాలం సన్నిహితంగా ఉండటం వల్ల కూడా సంక్రమిస్తుంది.» వివిధ శరీర అవయవాలు ఈ వ్యాధి వల్ల ప్రభావితమవుతాయి. వ్యాధి లక్షణాలు: » కణుపులు, వేళ్లు, పాదాలు వంకరపోవడం; పుండ్లు ఏర్పడటం, చర్మంపై మచ్చలు రావడం, స్పర్శ లేకపోవడం, చేతి, కాలివేళ్ల కండరాలు ఊడిపోయి రక్తస్రావం జరుగుతుంది. » హిస్టమైన్ పరీక్ష ద్వారా నాడుల క్షీణతను గుర్తించి కుష్ఠును అంచనా వేస్తారు. » ప్రస్తుతం 'ఫ్లోరోసెంట్ లెప్రసీ యాంటీబాడీ ఎబ్‌జాస్టన్' పరీక్ష ద్వారా నిర్ధారిస్తున్నారు. » ఎండీటీ (మల్టీ డ్రగ్ థెరపీ) ద్వారా దీన్ని నివారించవచ్చు. » భారత ప్రభుత్వం 1955లో 'జాతీయ కుష్ఠు నియంత్రణ కార్యక్రమం'ను చేపట్టింది. » ఫాంపిసిన్ డాప్‌సోన్, క్లోఫజిమైన్ లాంటి మందులు వాడటం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. క్షయ (టీబీ) » ఇది 'మైకో బ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్' అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది.


» గాలి, ఈగలు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి.» ప్రత్యక్ష స్పర్శ, పాలు, కలుషిత ఆహారం ద్వారా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.» ఊపిరితిత్తులు ఈ వ్యాధి బారిన పడతాయి. వ్యాధి లక్షణాలు: » సాయంత్ర సమయంలో జ్వరం, శ్లేష్మంతో కూడిన దగ్గు, అలసట, బరువు తగ్గడం, దగ్గినప్పుడు కళ్లె (తెమడ) రావడం. » వ్యాధి సోకిన భాగాన్ని బట్టి వ్యాధి లక్షణాలు మారతాయి. » ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O.) నివేదిక ప్రకారం ఈ వ్యాధి ద్వారా జరిగే మరణాలు ఎక్కువగా ఉన్నాయి. » ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఈ మరణాలు ఎక్కువ. » చిన్నపిల్లల్లో ఈ వ్యాధి రాకుండా BCG (Bacillus Calmette Guerin) టీకాను ఇస్తారు. » ఈ వ్యాధి నిర్ధారణకు 'మాంటెక్స్' పరీక్ష చేస్తారు. » క్షయ వ్యాధికి DOTS (Directly Observed Treatment Short Course) చికిత్స చేస్తారు. » 1962లో భారత ప్రభుత్వం ఈ వ్యాధి నివారణకు NTCP (National Tuberculosis Control Programme)ను చేపట్టింది. » అదే విధంగా 1997లో RNTCP (Revised National Tuberculosis Control Programme)ను చేపట్టింది. డిఫ్తీరియా » 'కార్ని బ్యాక్టీరియా' అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. » ఇది గొంతుకు వచ్చే వ్యాధి. అందువల్ల దీన్ని 'అంగుడు వాపు' వ్యాధి అని కూడా అంటారు. » ప్రత్యక్ష స్పర్శ, కలుషిత ఆహారం, గాలి, బ్యాక్టీరియా సోకిన శ్వాసనాళం నుంచి వచ్చే తుంపరలు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి. వ్యాధి లక్షణాలు: » జ్వరం, వాంతులు, గొంతులో గాయం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతులో బూడిద రంగు త్వచం ఏర్పడటం. » వ్యాధి సంక్రమణ కాలం ఒకటి నుంచి 7 రోజులు. » ఈ వ్యాధి నివారణకు 'షీక్ టెస్ట్' చేస్తారు. టైఫాయిడ్ » ఇది 'సాల్మొనెల్లా టైఫీ' అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది.


» దీన్ని 'ఎంటరిక్ జ్వరం' అని కూడా అంటారు.» ఈగలు, కలుషిత ఆహారం, కలుషిత నీరు, కలుషిత పాలు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి.» ముఖ్యంగా ఈగలు వ్యాధి జనకాల్ని మోసుకొచ్చి ఆహారం, నీటిని కలుషితం చేస్తాయి. » కలుషిత పాల ద్వారా ఈ వ్యాధి ఎక్కువగా సంక్రమిస్తుంది. » ముఖ్యంగా పేగులు, తర్వాత మొత్తం శరీరం ఈ వ్యాధికి ప్రభావితమవుతాయి. » ఈ వ్యాధి నిర్ధారణకు 'వైడల్ టెస్ట్'ను జరుపుతారు. » సంక్రమణ కాలం 10 నుంచి 14 రోజులు. » ఈ వ్యాధి రాకుండా ఇచ్చే వ్యాక్సిన్: TAB (Typhoid - Paratyphoid A & B Vaccine) » సల్ఫాడ్రగ్స్, క్లోరోమైసిటిన్ అనే మందుల్ని ఈ వ్యాధి చికిత్సకు ఉపయోగిస్తారు. వ్యాధి లక్షణాలు: జ్వరం, వికారం, వాంతులు, విపరీతమైన పొత్తికడుపు నొప్పి, ఉదాసీనత, విరేచనాలు. కోరింత దగ్గు » ఇది 'హెమోఫిల్లస్ పెర్టుసిస్' అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. » ఈ బ్యాక్టీరియాలు గాలి ద్వారా వ్యాపిస్తాయి. » తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు బ్యాక్టీరియాలు గాలిలోకి ప్రవేశిస్తాయి. » వ్యాధి సంక్రమణ కాలం 7 నుంచి 14 రోజులు. » ఈ వ్యాధిని పెర్టుసిస్ అని కూడా అంటారు. » శ్వాసనాళం, గొంతు ఈ వ్యాధి వల్ల ప్రభావితమవుతాయి. వ్యాధి లక్షణాలు: » చలి, పొడి దగ్గు, ఆ తర్వాత తీవ్రమైన దగ్గు, శ్వాస పీల్చిన తర్వాత ఎడతెరిపి లేకుండా దగ్గురావడం, ఎగశ్వాస. » దగ్గు ఎక్కువగా వస్తూ దగ్గు చివరిలో 'ఊఫ్' అనే శబ్దం రావడం వల్ల దీన్ని 'Whooping cough' అంటారు. గనేరియా » 'డిప్లోకోకస్' అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. » డిప్లోకోకస్ బ్యాక్టీరియాను 'నిస్సేరియా గనేరియా' అని కూడా అంటారు. » లైంగిక సంబంధం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. దీన్నే కోడ్ భాషలో STD (Sexually Transmitted Disease) అంటారు. » వ్యాధి సంక్రమణ కాలం 2 నుంచి 8 రోజులు. » జననావయవాలు ఈ వ్యాధి బారిన పడతాయి. వ్యాధి లక్షణాలు: » జననాంగాలు ఎరుపెక్కడం లేదా వాయడం, జననాంగాలపై పుండ్లు లేదా ఏర్పడిన పుండ్ల నుంచి చీము కారడం, మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట రావడం ఈ వ్యాధి లక్షణాలు. సిఫిలిస్ » 'ట్రిపోనిమా పల్లిడమ్' అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. » ట్రిపోనిమా పల్లిడమ్ అనేది సర్పిలాకారంలో ఉండే సూక్ష్మజీవి. » ప్రధానంగా లైంగిక చర్యల ద్వారా సంక్రమిస్తుంది. కానీ ప్రత్యక్ష స్పర్శ ద్వారా కూడా సంక్రమిస్తుంది. వ్యాధి లక్షణాలు: » జననావయవాలపై గట్టి పుండ్లు ఏర్పడటం లేదా ఎర్రటి గుల్లలు ఏర్పడతాయి. చర్మంపై తీవ్రమైన బొబ్బలు ఏర్పడతాయి. » జననావయవాలు ఈ వ్యాధివల్ల ప్రభావానికి గురవుతాయి. » కణజాల ధ్వంసం కూడా సంభవిస్తుంది. » వ్యాధి సంక్రమణకు 10 నుంచి 90 రోజులు పడుతుంది. » వ్యాధి నిర్ధారణకు VDRL (Venerial Disease Research Lab) పరీక్ష చేస్తారు. మెనింజైటిస్ » 'నిస్సెరా మెనింజైటిస్' అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. » కలుషిత నీరు ఈ వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది. » ఈ వ్యాధి వల్ల మెదడు, వెన్నుపాము ప్రభావితమవుతాయి. 
గొంతు పుండు
 » ఈ వ్యాధిని 'థ్రోట్ ఇన్‌ఫెక్షన్' అని కూడా అంటారు. » 'స్ట్రెప్టోకోకస్' అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. » ఈ బ్యాక్టీరియా సోకిన గొంతు నుంచి నోటి ద్వారా వెలువడే తుంపర్లు ఈ వ్యాధికి వాహకంగా పని చేస్తాయి. » ముక్కు పొరల నుంచి కూడా ఈ బ్యాక్టీరియా వెలువడి వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది. » వ్యాధి సంక్రమణకు 3 నుంచి 5 రోజులు పడుతుంది. » ఈ వ్యాధికి గొంతు, ముక్కు ప్రభావితమవుతాయి. వ్యాధి లక్షణాలు: గొంతు పుండు పడటం; తరచుగా దగ్గు, జ్వరం రావడం. 
బొటులిజం
 » 'క్లాస్ట్రీడియం బొటులినమ్' అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.


» కలుషిత ఆహారం ఈ వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది.» జీర్ణాశయం ఈ వ్యాధి బారిన పడుతుంది.» ఈ వ్యాధి సంక్రమణకు 18 నుంచి 66 గంటలు మాత్రమే పడుతుంది. వ్యాధి లక్షణాలు: వాంతులు, విరేచనాలు, వికారం, అలసట, అతిసారం, దృష్టి లోపాలు, పక్షవాతం. ఆంథ్రాక్స్ » 'బాసిల్లస్ ఆంథ్రాసిస్' అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. » పశువుల పాలు, మాంసం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. » ఈ వ్యాధి నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ప్లేగు » ఈ వ్యాధిని 'బ్యుబోనిక్ ప్లేగు' అని కూడా అంటారు. » 'షార్ట్‌రాడ్ యెర్సినియా పెస్టిస్' అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. » ఈ బ్యాక్టీరియాను 'పాశ్చరెల్లా పెస్టిస్' అని కూడా అంటారు. » ఎలుకల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. » వ్యాధి సంక్రమణకు 2 నుంచి 10 రోజులు పడుతుంది. వ్యాధి లక్షణాలు: » అకస్మాత్తుగా జ్వరం రావడం, వాంతులు, వేడితో కూడిన పొడి చర్మం, చర్మంమీద నల్లటి మచ్చలు, ఉరఃసంధిలోని శోషరస కణుపులు వాయడం, కండరాలు వంకరపోవడం. » వ్యాధి నివారణకు 'టెట్రాసైక్లిన్' అనే మందును వాడతారు. బాసిల్లరి డీసెంట్రీ » ఇది 'షిజెల్లా డిసెంట్రియా' అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. » ఈగలు, కలుషిత ఆహారం, కలుషిత నీరు వాహకాలుగా పనిచేస్తాయి. » వ్యాధి సంక్రమణకు ఒకటి నుంచి 4 రోజులు పడుతుంది. వ్యాధి లక్షణాలు: జ్వరం, వికారం, వాంతులు, విరేచనాలు, పొత్తికడుపులో నొప్పి, మలంలో రక్తం పడటం.