మానవుల్లో హెల్మింథిస్ / నెమటోడ్స్ వల్ల వచ్చే వ్యాధులు

 

ఆస్కారియాసిస్ 
» 'ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్' అనే హెల్మింథిస్ వ్యాధి కారకంగా పనిచేస్తుంది.


» 'ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్'ను 'ఏలిక పాము' అని కూడా అంటారు.
» అపరిశుభ్రత వల్ల ఇది శరీరంలోకి ప్రవేశిస్తుంది.
» ఈ పరాన్నజీవి మానవుడి పేగులో ఉండి రోజుకు 2 లక్షల గుడ్లను పెడుతుంది. ఈ చర్య వల్ల ఆహార రవాణాలో ఆటంకం ఏర్పడి కడుపు నొప్పి, చిన్న పిల్లల్లో రక్తహీనత సంభవిస్తుంది. 
ఎంటరోబియాసిస్ 
» 'ఎంటరోబియస్ వర్మిక్యులారిస్' అనే హెల్మింథిస్ వ్యాధి కారకంగా పనిచేస్తుంది. 
» ఈ వ్యాధినే 'పిన్‌వార్మ్ వ్యాధి' అని కూడా అంటారు. 
» ఈ వ్యాధి వల్ల దురద, పాయువు చుట్టూ చీరుకుపోవడం, నిద్రలేమి, ఉండుకం (అపెండిక్స్) వాయడం సంభవిస్తాయి. 
ఎంఖైలోస్టోమియాసిస్ 
» 'ఎంఖైలోస్టోమా డుయోడినేల్' అనే హెల్మింథిస్ వ్యాధి కారకంగా పనిచేస్తుంది. 
» చెప్పులు లేకుండా మల మూత్రాలు చేసే ప్రాంతాల్లో తిరిగినప్పుడు ఈ వ్యాధి జనక లార్వా (ఫెలేరిఫాం లార్వా) శరీరంలోకి ప్రవేశించి మానవుడి చిన్నపేగులో ఆవాసం ఏర్పరచుకుంటుంది. 
» చర్మంపై ఎర్రని, దురద పుట్టించే పుండ్లు; రక్తహీనత, మలబద్ధకం, ఆంత్రమూలంలో పుండ్లు ఈ వ్యాధి వల్ల సంభవిస్తాయి. 
షిస్టోసోమియాసిస్ 
» 'షిస్టోసోమా హిమటోబియమ్' అనే హెల్మింథిస్ వ్యాధికారకంగా పనిచేస్తుంది. 
» ఈ వ్యాధిని 'బిల్హర్జియాసిస్' అని కూడా అంటారు. 
» ఈ వ్యాధి సంక్రమణకు 'బులినస్' అనే నత్త సహకరిస్తుంది. 
» ఈ వ్యాధికి 'స్విమ్మర్స్ ఇచ్' అనే మరో పేరు కూడా కలదు. 
» ఈ వ్యాధి జనకం మూత్రాశయం, శ్రోణి సిరల్లో నివసిస్తుంది. 
» జ్వరం, కాలేయం, వాపు, మూత్రంతోపాటు రక్తం పడటం; దురద, మంట లాంటి లక్షణాలు ఈ వ్యాధి ద్వారా సంక్రమిస్తాయి. 
ఫైలేరియాసిస్ 
» ఈ వ్యాధికి బోదకాలు, ఎలిఫెంటియాసిస్ అనే పేర్లు ఉన్నాయి.


» 'ఉచరేరియా బ్రాంకాఫ్టి' అనే హెల్మింథిస్ వ్యాధి కారకంగా పనిచేస్తుంది.
» శోషరస నాళాలు, శోష కణాల్లో ఇది నివసిస్తుంది.
» ఈ వ్యాధి వల్ల కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలు ఉబ్బుతాయి. 
టీనియాసిస్ 
» 'టీనియా సోలియం' అనే హెల్మింథిస్ ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తుంది.


» సరిగా ఉడికించని పంది మాంసం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
» కడుపు నొప్పి, అజీర్తి, మలబద్ధకం అనే లక్షణాలు ఈ వ్యాధిలో కనిపిస్తాయి.