విటమిన్లు
» విటమిన్లు శరీరానికి కావలసిన ముఖ్యమైన అమైనో ఆమ్లాలు. | |
» Vital, Amines అనే పదాల నుంచి 'Vitamins' అనే పదం రూపొందింది. | |
» సర్ హెచ్.జి.హోప్‌కిన్స్ 1912లో మొదటిసారిగా పాలలో విటమిన్లను గుర్తించారు. | |
» విటమిన్లు అనే పేరును సూచించింది 'ఫంక్'. | |
» విటమిన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం 'విటమినాలజీ'. | |
» విటమిన్లు ద్రావణీయత ఆధారంగా 2 రకాలు: 1) కొవ్వులో కరిగే విటమిన్లు 2) నీటిలో కరిగే విటమిన్లు | |
» కొవ్వులో కరిగే విటమిన్లు A, D, E, K | |
» నీటిలో కరిగే విటమిన్లు B, C | |
» విటమిన్లు ఎంజైములకు సహ ఎంజైములుగా పనిచేస్తాయి. | |
» ఇవి సూక్ష్మ పోషకాలుగా వ్యవహరిస్తాయి. | |
» విటమిన్లు దేహ నిర్మాణంలో కానీ, శక్తినివ్వడంలో కానీ పాలుపంచుకోవు. కానీ దేహంలో జరిగే వివిధ జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తాయి. | |
విటమిన్ - ఎ | |
» విటమిన్ A రసాయనిక నామం 'రెటినాల్'. | |
» మరో పేరు 'యాంటీ గ్జెరాఫ్తాల్మిక్ విటమిన్'. | |
» ఇది కంటిచూపునకు తోడ్పడే విటమిన్. | |
» రక్తనాళాల్లో మ్యూకస్ అనే పొరను రక్షిస్తుంది. | |
» రెటీనాలో వర్ణద్రవ్యాల్ని ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. | |
» మొక్కల్లో విటమిన్ A బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. | |
» ఆకుకూరల్ని ఆహారంగా తీసుకున్నప్పుడు బీటా కెరోటిన్ శరీరంలోని పేగుల్లో విటమిన్ Aగా మారుతుంది. | |
» రోజువారీ తీసుకునే ఆహారంలో విటమిన్ A ఉండాల్సిన పరిమాణం 750 మి.గ్రా. | |
» విటమిన్ A లోపం వల్ల ప్రతి ఏడాది భారత్‌లో అంధత్వానికి గురయ్యేవారి సంఖ్య 60వేలని ఒక అంచనా. | |
» దీని లోపం వల్ల రేచీకటే కాకుండా వర్ణాంధత్వం కూడా సంభవిస్తుంది. | |
లభ్యమయ్యే పదార్థాలు: బొప్పాయి, క్యారెట్, ఆకుకూరలు, గుడ్లు, చేపనూనె, పాలు, పసుపు పచ్చని ఫలాలు (గుమ్మడి పండు, జామ పండు), కాలేయం, వెన్న, టొమాటో | |
» మానవ శరీరం 6 నెలల పాటు విటమిన్ Aను నిల్వ ఉంచుకోగలదు. | |
» జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ప్రతి 6 నెలలకు ఒకసారి పాఠశాల పిల్లలకు విటమిన్ Aను అందించడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చని సిఫార్సు చేసింది. | |
» విటమిన్ A లోపించడం వల్ల చర్మం పొడిబారుతుంది. | |
» కనుగుడ్లు ఎండిపోవడాన్ని 'జెరాఫ్తాల్మియా' అంటారు. | |
» విటమిన్ Aకు 'యాంటీ ఇన్‌ఫెక్టివ్' విటమిన్ అనే మరో పేరు కూడా ఉంది. | |
» నేత్రగోళం మీద కార్నియా శాశ్వతంగా నశించిపోవడాన్ని 'కేరటోమలేసియా' అంటారు. | |
» లాక్రిమల్ గ్రంథులు విడుదల చేసే స్రావాలు ఆగిపోవడం వల్ల నేత్రాలు పొడిబారిపోయి జెరాఫ్తాల్మియాకు కారణమవుతుంది. | |
» రేచీకటి వ్యాధినే 'నిక్టిలోఫియా' అంటారు. | |
» కన్ను తెల్ల గుడ్డు మీద తెల్లని చారలు మచ్చల్లా కనిపిస్తాయి. వీటిని బైటాల్ చుక్కలు అంటారు. ఇవి విటమిన్ A లోపం వల్ల ఏర్పడతాయి | |
విటమిన్ - బి | |
విటమిన్ - బి కాంప్లెక్స్ 8 రకాలు | |
1) విటమిన్ - బి1: | |
» దీని రసాయన నామం 'థయమిన్'. | |
» వాడుక పేర్లు యాంటీ బెరిబెరి, యాంటీ న్యూరైటిస్ విటమిన్. | |
» పాలిష్ చేసిన బియ్యంలో ఈ విటమిన్ లోపిస్తుంది. | |
» హృదయ స్పందన క్రమరహితమవడాన్నే 'బెరిబెరి' అంటారు. | |
» నరాలు బలహీనమవడం, పాక్షిక పక్షవాతాన్నే పాలీన్యూరైటిస్ అంటారు. | |
లభ్యమయ్యే పదార్థాలు: వేరుశనగ, తవుడు, సోయాబీన్స్, దంపుడు బియ్యం, గంజి, బియ్యం, గోధుమ, జొన్నల్లోని పై పొరలు. | |
2) విటమిన్ - బి2: | |
» దీని రసాయన నామం 'రైబోఫ్లేవిన్'. | |
» వాడుక పేర్లు ఎల్లో విటమిన్, యాంటీ ఖీలోసిస్ విటమిన్, యాంటీ గ్లాసైటిస్ విటమిన్, విటమిన్ G. | |
» ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి కారణం విటమిన్-బి2. | |
లోపం వల్ల వచ్చే వ్యాధులు: ఖీలోసిస్, గ్లాసైటిస్, డెర్మటైటిస్. | |
» నోటి మూలలు పగలడాన్ని 'ఖీలోసిస్' అంటారు. | |
» గ్లాసైటిస్‌లో వల్ల నాలుకపై పూత, నాలుక మంట కనిపిస్తాయి. | |
» ముఖంపై చర్మం పాలిపోవడాన్నే 'డెర్మటైటిస్' అంటారు. | |
లభ్యమయ్యే పదార్థాలు: కొబ్బరి, బార్లీ, జీడిమామిడి, బాదం పప్పు, రాగులు, తవుడు, బొప్పాయి, గుడ్లు, పాలు, కాలేయం, మూత్రపిండం. | |
» పాలను బాగా మరగబెట్టినప్పుడు అవి లేత పసుపు రంగు పొందడానికి కారణం పాలలో రైబోఫ్లేవిన్ ఉండటమే. | |
3) విటమిన్ - బి3: | |
» దీని రసాయన నామం 'నియాసిన్' లేదా 'నికోటిక్ ఆమ్లం' లేదా 'నికోటినమైడ్'. | |
» వాడుక పేర్లు యాంటీ పెల్లాగ్రా విటమిన్, 4D విటమిన్, సుస్థిర విటమిన్, విటమిన్-PP. | |
» ఇది NDP, ADP సంయోగాల తయారీలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. | |
» ఈ విటమిన్‌ను ఆక్సీకరణ, ఉష్ణం తేలికగా నాశనం చేయలేవు. | |
లోపం వల్ల వచ్చే వ్యాధులు: పెల్లాగ్రా, పెదాలు లావెక్కడం, మచ్చలతో, మందమైన చర్మంతో అరిచేతులు తయారవడం. | |
» చర్మం గరుకుగా తయారై, పొలుసులుగా ఏర్పడి ఊడిపోవడాన్ని 'పెల్లాగ్రా' అంటారు. | |
లభ్యమయ్యే పదార్థాలు: ముల్లంగి, బఠాణీ, కాలేయం, ఈస్ట్, చేపలు, వేరుశనగ. | |
4) విటమిన్ - బి5: | |
» దీని రసాయన నామం 'పాంటోథెనిక్ ఆమ్లం'. | |
» ప్రకృతిలో విరివిగా లభించడం వల్ల దీన్ని 'సర్వ విస్తృత విటమిన్' అంటారు. | |
» గ్రీకు భాషలో పాంటోథస్ అంటే ప్రతిచోటా అని అర్థం. | |
లోపం వల్ల వచ్చే వ్యాధులు: పెరుగుదల మందగించడం, వెంట్రుకలు రాలడం, బాలనెరుపు, ఆర్థరైటిస్, బర్నింగ్‌ఫీట్. | |
» కీళ్లవాతాన్నే ఆర్థరైటిస్ అంటారు. | |
» అరికాళ్లు, అరిచేతుల్లో మంటలు పుట్టడాన్ని 'బర్నింగ్ ఫీట్' అంటారు. | |
లభ్యమయ్యే పదార్థాలు: కాయగూరలు, కాలేయం, గుడ్డు, మాంసం, చిలగడదుంప, చేపలు, పాలు, ఈస్ట్, ధాన్యాలు, పండ్లు. | |
4) విటమిన్ - బి6: | |
» దీని రసాయన నామం 'పైరిడాక్సిన్'. | |
» వాడుక నామం యాంటీ అనీమియా విటమిన్. | |
» అమైనో ఆమ్లాల ఉత్పత్తిలో, జీర్ణక్రియలో B6 విటమిన్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. | |
» ప్రతిరక్షకాలు, హిమోగ్లోబిన్‌ల ఉత్పత్తిలో పాల్గొంటుంది. | |
లోపం వల్ల వచ్చే వ్యాధులు: అజీర్తి, రక్తహీనత, ఫిట్సు లాంటి వ్యాధులు, కోపం ఎక్కువగా రావడం, అనీమియా, మొటిమలు, చర్మ వ్యాధులు. | |
లభించే పదార్థాలు: గోధుమ, దంపుడు బియ్యం, సోయాచిక్కుడు, మాంసం, గుడ్లు, కాలేయం, పాలు, గుడ్డుసొన. | |
5) విటమిన్ - బి7: | |
» దీన్ని విటమిన్ H అంటారు. | |
» సల్ఫర్ మూలకం కలిగిన విటమిన్ ఇది. | |
» 1939లో ఈ విటమిన్‌ను కనిపెట్టారు. | |
» అమైనో ఆమ్లాల, కొవ్వు ఆమ్లాల జీవన క్రియల్లో తోడ్పడుతుంది. | |
» పచ్చిగుడ్డు తాగడం వల్ల శరీరం విటమిన్ B7ను కోల్పోతుంది. | |
» దీని రసాయన, వాడుక నామం 'బయోటిన్'. | |
లోపం వల్ల వచ్చే వ్యాధులు: కండరాల నొప్పులు, అలసట, నాడీ మండలంలో తేడాలు సంభవించడం, మానసిక రుగ్మత, రక్తంలో కొలెస్ట్రాల్ అధికమవడం, ఆకలి మందగించడం. | |
లభించే పదార్థాలు: చేపలు, మాంసం, సోయాచిక్కుడు, టొమాటో, పాలు, కాలేయం, మూత్రపిండం, గింజలు, కాయగూరలు. | |
6) విటమిన్ - బి11: | |
» వాడుక నామం 'ఫోలిక్ ఆమ్లం' లేదా 'ఫొలాసిస్'. రసాయన నామం కూడా ఇదే. | |
» దీన్ని M - విటమిన్ అని కూడా అంటారు. | |
» దీన్ని ఎల్లాప్రగడ సుబ్బారావు కనుక్కున్నారు. | |
» గర్భిణీ స్త్రీలకు మొదటిసారిగా ఇచ్చే విటమిన్ ఫోలిక్ ఆమ్లం. | |
» ఈ ఆమ్లం స్పినాక్ పత్రాల నుంచి మొదటిసారిగా లభ్యమైంది. | |
» 'ఫోలియం' అంటే 'పత్రం' అని అర్థం. | |
» కోలిన్, సీరైన్‌ల సంశ్లేషణలో, న్యూక్లిక్ ఆమ్లాల (DNA, RNA) సంశ్లేషణలో ఫోలిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది. | |
లోపం వల్ల వచ్చే వ్యాధులు: రక్తహీనత, అతిసారం, మానసిక రుగ్మతలు. | |
లభించే పదార్థాలు: మొక్కజొన్న, గోధుమ, మొలకెత్తే గింజలు, ఆకుకూరలు, ధాన్యాలు, ఫలాలు, పాలు, గుడ్డు, మాంసం, కాలేయం. | |
7) విటమిన్ - బి12: | |
» దీని రసాయన నామం 'సయనకోబాలమిన్' | |
» దీని మరో రసాయన నామం 'కోబాలమిన్' | |
» దీన్నే 'యాంటీ ఫెర్నీషియస్ ఎనీమియా' విటమిన్ అంటారు. | |
» నీలి రంగులో ఉంటూ కోబాల్ట్ (Co) అనే లోహ మూలకాన్ని కలిగి ఉంటుంది. | |
» ఇది కేంద్రకామ్లాల సంశ్లేషణలో, ఎర్ర రక్తకణాలు ఏర్పడడానికి, యాంటీబాడీల ఉత్పత్తికి, నాడీ కణపు మైలిన్ తొడుగు ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. | |
లోపం వల్ల వచ్చే వ్యాధులు: పెర్నీషియస్ అనీమియా, మాక్రోసైటిక్ అనీమియా, బాలింతల్లో పాల ఉత్పత్తి కుంటుపడుట, హానికర రక్తహీనత. | |
లభించే పదార్థాలు: కోడిమాంసం, పాలు, గుడ్డు, కాలేయం. | |
విటమిన్ - సి | |
» దీని రసాయన నామం 'ఆస్కార్బిక్ ఆమ్లం'. | |
» దీని వాడుక నామం 'యాంటీ స్కర్వీ విటమిన్'. | |
» గాయాలు త్వరగా మానడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి, విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది. | |
» కణాంతరాల్లో కొల్లాజెన్ ఏర్పడటానికి దోహదపడుతుంది. | |
» దంతాలలో డెంటిన్ అనే పదార్థం ఏర్పడటానికి దోహదం చేస్తుంది. | |
» దీని లోపం వల్ల రక్తనాళాలు పెళుసుగా అవుతాయి. చిగుళ్లు చిట్లి రక్తస్రావం జరుగుతుంది. | |
» స్కర్వీ వ్యాధిని 'సెయిలర్స్ డిసీజ్' అని కూడా అంటారు. | |
లభించే పదార్థాలు: సిట్రస్ జాతి ఫలాలు (నిమ్మ, ఉసిరి), జామకాయలు, టొమాటో, ఆకుకూరలు. | |
విటమిన్ - డి | |
» దీని రసాయన నామం 'కాల్సిఫెరాల్'. | |
» వాడుక నామాలు సన్‌షైన్ విటమిన్, ఫ్రీ విటమిన్, హార్మోన్ లాంటి విటమిన్, యాంటీ రికెటింగ్ విటమిన్. | |
» అన్నవాహిక నుంచి కాల్షియం, ఫాస్ఫరస్‌లను ఎక్కువగా గ్రహించి ఎముకలు ఏర్పడటానికి, గట్టిపడటానికి తోడ్పడుతుంది. | |
» సూర్యరశ్మిలోని UV కిరణాల ద్వారా చర్మం కింద గల కొలెస్టరాల్ విటమిన్ Dగా తయారవుతుంది. | |
» చిన్న పిల్లల్లో విటమిన్ D లోపం వల్ల రికెట్స్, పక్షి లాంటి ఛాతీ, రాకిటిక్ రోజరీ అనే వ్యాధులు వస్తాయి. | |
» పెద్దవారిలో ఆస్టియోమలేసియా, ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధులు వస్తాయి. | |
» దొడ్డికాళ్లు, ముట్టికాళ్లు ఏర్పడడాన్ని 'రికెట్స్' అంటారు. | |
» పక్కటెముకల్లో బుడిపెలు ఏర్పడటాన్ని రాకిటిక్ రోజరీ అంటారు. | |
లభించే పదార్థాలు: సూర్యరశ్మి, కాడ్, షార్క్ చేపల కాలేయనూనె, పాలు, క్యాబేజీ, గుడ్డు (పచ్చసొన). | |
» ప్రపంచంలో 80% మంది డి-విటమిన్ లోపంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక తెలుపుతోంది. | |
విటమిన్ - ఇ | |
» దీని రసాయన నామం 'టోకోఫెరాల్'. | |
» వాడుకనామాలు 'బ్యూటీ విటమిన్', 'యాంటీ స్టెరిలిటీ విటమిన్'. | |
» త్వచాల నిర్మాణానికి, యాంటీ ఆక్సిడెంట్‌గా, కొటోజెనెసిస్, లైపోజెనెసిస్ ఆక్సీకరణ ప్రక్రియలకు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమ నిర్వహణకు, ముఖంపై ముడుతలు రాకుండా ఉండటానికి E విటమిన్ ఉపయోగకరం. | |
లోపం వల్ల వచ్చే వ్యాధులు: కండరాల క్షీణత, ఎర్ర రక్తకణాలు విచ్ఛిన్నమవడం, పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలల్లో రుతుస్రావం, గర్భస్రావం. | |
లభించే పదార్థాలు: సోయా చిక్కుడు, పత్తి గింజల నూనె, పామ్ ఆయిల్, గోధుమ, చిలగడ దుంపలు, పొద్దు తిరుగుడు గింజల నూనె, ఫలాలు. | |
విటమిన్ - కె | |
» దీని రసాయన నామం 'నాఫ్తోక్వినోన్' లేదా 'ఫిల్లోక్వినోన్'. | |
» వాడుక నామాలు రక్త స్కందన విటమిన్, రక్త స్రావక నిరోధక విటమిన్ (కొయాగ్యులేషన్ విటమిన్). | |
» ప్రోథ్రాంబిన్ ఏర్పరచడంలో ఉపయోగపడుతుంది. | |
» రక్తం గడ్డ కట్టడంలో ఉపయోగపడుతుంది. | |
లోపం వల్ల వచ్చే వ్యాధులు: గాయాలైనప్పుడు ఆగని రక్తస్రావం, పిల్లల్లో పచ్చ కామెర్లు. | |
» విటమిన్ Kను కనుక్కున్నవారు డాయిసీడాం. | |
లభించే పదార్థాలు: క్యాలీఫ్లవర్, క్యాబేజీ, గుడ్లు, ఆకుకూరలు, ఆవు పాలు, టొమాటో. | |
» ఆపరేషన్ చేయడానికి ముందు రోగికి, ప్రసవానికి ముందు తల్లికి కె విటమిన్‌ను ఇస్తారు. | |
* శరీరంలో విటమిన్లు మితిమీరి చేరితే కొన్ని విశిష్ట రోగ లక్షణాలు ఏర్పడతాయి. విటమిన్లు ఎక్కువైన స్థితిని 'అతి విటమినీయ స్థితి' అంటారు. | |
* సి విటమిన్ ఎక్కువైతే గౌట్ వ్యాధి, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. | |
* డి విటమిన్ ఎక్కువైతే మృదుకణజాలం అస్థీకరణ చెందుతుంది. |