ప్రముఖ వ్యక్తులు నినాదాలు

జాతీయ వ్యక్తులు:
నినాదం వ్యక్తి 
» గోబ్యాక్ టు వేదాస్ (వేదాలకు మరలండి)-స్వామి దయానంద సరస్వతి


» నాకు రక్తాన్ని ఇవ్వండి - మీకు నేను స్వాతంత్య్రం ఇస్తాను-సుభాష్ చంద్రబోస్
» ఢిల్లీ చలో-సుభాష్ చంద్రబోస్


» జైహింద్-సుభాష్ చంద్రబోస్
» జై జవాన్, జై కిసాన్-లాల్‌ బహదూర్ శాస్త్రి


» సత్యం, అహింస నాకు దేవుళ్లు-మహాత్మా గాంధీ


» డూ ఆర్ డై (చేయండి లేదా చావండి)-మహాత్మా గాంధీ
» బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం-మహాత్మా గాంధీ 
» బెంగాల్ విభజన తరువాత దేశంలో అసలైన చైతన్యం మొదలైంది-మహాత్మా గాంధీ 
» సంస్కారం లేని చదువు వాసనలేని పువ్వులాంటిది-మహాత్మా గాంధీ 
» ది వేదాస్ కంటైన్ ఆల్ ది ట్రూత్-స్వామి దయానంద సరస్వతి 
» భారతదేశం, భారతీయుల కొరకే-స్వామి దయానంద సరస్వతి 
» ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి-లాలా లజపతిరాయ్ 
» కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైంది కాదు, ప్రజలు ప్రణాళిక చేసిందీ కాదు-లాలా లజపతిరాయ్ 
» ముందుకు సాగండి-మేడం బికాజికామా


» నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి-సర్దార్ వల్లభాయ్ పటేల్
» రోజ్‌గార్ బడావో-మన్మోహన్‌సింగ్ 
» జై విజ్ఞాన్-అటల్‌బిహారి వాజ్‌పేయి 
» భారతదేశానికి హిందువులు, ముస్లింలు రెండు కళ్లులాంటివారు-సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్
» రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణ వాయువులాంటిది-అరబిందో ఘోష్ 
» ప్రజలే ప్రభువులు-లోక్‌సత్తా 
» ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు-జవహర్‌లాల్ నెహ్రూ


» ప్రతి కంటి నుంచి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యం-జవహర్‌లాల్ నెహ్రూ
» చెడును సహిస్తే అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది-జవహర్ లాల్ నెహ్రూ 
» ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం-శ్రీశ్రీ 
» భారతదేశం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క పాఠం ఏమిటంటే ఎలా చావాలో, దాన్ని బోధించవలసిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే-ఎం.కె. ధింగ్రా
» ఇంక్విలాబ్ జిందాబాద్ (విప్లవం వర్ధిల్లాలి)-భగత్‌సింగ్ 
» స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని సాధించి తీరుతాను-బాలగంగాధర తిలక్ 
» దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయన్ను దేవునిగా అంగీకరించను-బాలగంగాధర తిలక్ 
» పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివాళ్లు మాత్రమే స్వాతంత్య్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు-గోపాలకృష్ణ గోఖలే 
» ఆధునిక విద్య, విజ్ఞానాల్ని ఆర్జించకుండా మన జాతి పురోగమించటం సాధ్యం కాదు-రాజారామ్మోహన్‌రాయ్ 
» కళ కళ కోసం కాదు ప్రజల కోసం-బళ్ళారి రాఘవ 
» గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం ఎప్పుడూ జీవించే ఉంటుంది-భోగరాజు పట్టాభి సీతారామయ్య 
» దేశ్ బచావో, దేశ్ బనావో-పి.వి.నరసింహారావు 
» వడగాల్పులు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం-గుర్రం జాషువా


» ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా అనుమానమేమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం-వి.డి.సావర్కర్
» నా తెలంగాణ కోటి రతనాల వీణ-దాశరథి కృష్ణమాచార్యులు


» బోదెను చేధిస్తే ఎండిన కొమ్మలు వాటంతటవే పడిపోతాయి-బాజీరావు I
» చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవడం నేరం, గొప్ప కలలు కనండి, వాటి సాకారానికై కృషిచేయండి-ఎ.పి.జె. అబ్దుల్ కలాం


» పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్ర పోనివ్వండి-మోతీలాల్ నెహ్రూ 
» నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడతాను-ఇందిరాగాంధీ


» అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో-కందుకూరి వీరేశలింగం పంతులు
» బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి, బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు-మౌలానా అబుల్ కలాం ఆజాద్ 
» ప్రత్యేక రక్షణలు కోరుతున్న ముస్లింలు ఎంత మూర్ఖులో వాటిని ఇస్తున్న హిందువులు అంతకంటే పెద్ద మూర్ఖులు-మౌలానా అబుల్ కలాం ఆజాద్ 
» బికారీ హఠావో-రాజీవ్ గాంధీ 
» వాణి నా రాణి-పిల్లలమర్రి పినవీరభద్రుడు 
» బ్రిటిషర్ల ఫించను పొందుతున్న రాజుల, నవాబుల జాబితాలో బతకటం కంటే సైనికుడిగా మరణించటమే మేలు-టిప్పుసుల్తాన్ 
» సూర్యుడు కనపడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరకు నక్షత్రాలు కూడా కనపడకుండా పోతాయి-రవీంద్రనాథ్ ఠాగూర్


» స్వాతంత్య్రం అనేది ఓ కనిపించని మహా అదృష్టం, అది లేనప్పుడు గాని దాని విలువ తెలియదు-రవీంద్రనాధ్ ఠాగూర్
» అందరిలోనూ సామాన్యున్ని అయినా చిరంజీవుణ్ణి-సి.నారాయణరెడ్డి 
» కులం పునాదులపై ఒక జాతిని గాని ఒక నీతిని గాని నిర్మించలేము-బి.ఆర్. అంబేడ్కర్


» మహారాష్ట్రులనంతా ఒకచోట చేర్చు. మతం మరలా జీవించేటట్లు చూడు. మనల్ని చూచి మన పూర్వులు స్వర్గం నుంచి నవ్వుతున్నారు-గురు రామదాస్
» మానవులందరూ నా బిడ్డలవంటివారు-అశోకుడు 
అంతర్జాతీయం వ్యక్తులు:
నినాదం వ్యక్తి 
» స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది-హిట్లర్ 
» స్త్రీలకు ప్రసవం ఎలాంటిదో దేశానికి స్వాతంత్య్రం అలాంటిది-ముస్సోలిని 
» వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం, ధాన్యం కోసం యుద్ధం-ముస్సోలిని 
» ప్రజలు విన్నట్లు స్వర్గం వింటుంది. ప్రజలు చూస్తున్నట్లు స్వర్గం చూస్తుంది-కన్ఫ్యూషియస్ 
» నేను వచ్చాను, నేను చూశాను, నేను జయించాను-జూలియస్ సీజర్ 
» నాలెడ్జ్ ఈజ్ వపర్-జె.ఎల్.మిల్ 
» భూమిపై పుట్టే ప్రతి వ్యక్తి ఆర్థికంగా నరకాన్ని సృష్టించినవాడవుతాడు-మాల్థస్ 
» ది రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బిట్టర్ బట్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్-అరిస్టాటిల్ 
»ఎక్కడైతే ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుందో అక్కడ ఆరోగ్యవంతమైన జ్ఞానం ఉంటుంది-అరిస్టాటిల్ 
» నేనే రాజ్యాన్ని-లూయి XIV 
» నా తర్వాత ప్రళయం వస్తుంది-లూయి XV 
» స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్లతో బంధించబడ్డాడు-రూసో 
» బ్యూటీ ఈస్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈస్ బ్యూటీ-జాన్‌కీట్స్ 
» నేను భారతదేశానికి యాత్రికునిగా రాలేదు గాంధీ పుట్టిన దేశానికి నా నివాళ్లు అర్పించడానికి వచ్చాను-మార్టిన్ లూథర్ కింగ్ 
» బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తిమంతమైంది-అబ్రహం లింకన్


» నీకు బానిసగా ఉండటానికి ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటానికి కూడా ఇష్టపడకూడదు-అబ్రహం లింకన్
» ఇవ్వడానికి నా దగ్గర ఏమీలేదు. రక్తం, శ్రమ, కన్నీళ్లు తప్ప-విన్‌స్టన్ చర్చిల్ 
» లిపి పుట్టుకే నాగరికతల ఆవిర్భావానికి చిహ్నం-గార్డెన్ చైల్డ్ 
» శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనసుకు చదువు అలాంటిది-రాబర్ట్ స్టీల్ 
» మతం మత్తుమందు వంటిది-కారల్‌మార్క్స్ 
» పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప-కారల్ మార్క్స్


» చరిత్ర అంటే వర్గ పోరాటాల రికార్డే తప్ప మరేమీ కాదు-కారల్‌మార్క్స్
» ప్రపంచ కార్మికులారా ఏకంకండి-కారల్ మార్క్స్ 
» అలవాటు అనే పదాన్ని అరికట్టకపోతే అది అవసరంగా మారుతుంది-సెయింట్ అగస్టీన్ 
» జన్మతః బ్రిటిష్‌వారు పాలకులు, హిందూ దేశస్థులు పాలింపబడేవారు మాత్రమే-కారన్‌వాలిస్ 
» నూరు పువ్వులు వికసించనీ, వెయ్యి ఆలోచనలు సంఘర్షించనీ-మావో సేటుంగ్ 
» నేనే విప్లవాన్ని, నేనే విప్లవ శిశువుని-నెపోలియన్ 
» అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం-నెపోలియన్ 
» ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సర్వ అరిష్టాలు లండన్‌లోనే ఉద్భవిస్తాయి-నెపోలియన్ 
» చైనా నిద్రావస్థలో ఉన్న పెనుభూతం. దానికి మెలకువ వచ్చిన రోజు ప్రపంచంపై పాశ్చాత్య దేశాలు పెత్తనం అంతమవుతుంది-నెపోలియన్ 
» సంగీత విద్వాంసుడు ఫిడేలును ప్రేమించినట్లు నేను అధికారాన్ని ప్రేమిస్తాను-నెపోలియన్ 
» పవిత్ర రోమన్ సామ్రాజ్యం పవిత్రం కాదు, అసలది పవిత్ర రోమన్ సామ్రాజ్యమే కాదు-నెపోలియన్ 
» గివ్ మి స్పేస్ టు స్టాండ్ అవే ఫ్రమ్ ద ఎర్త్ అండ్ ఐ షల్ లిఫ్ట్ దిస్ ఎర్త్-ఆర్కిమెడిస్ 
» భారతదేశ వ్యాపారమే ప్రపంచ వ్యాపారమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆ దేశాన్ని తమ ఆధిప్యతంలో ఉంచుకోగలరో వారే ఐరోపాను నిరంకుశంగా పరిపాలించగలరు-రష్యా పీటర్ చక్రవర్తి 
» ఆహారం కంటే ఫిరంగులే ముఖ్యం-గోరింగ్ (హిట్లర్ అనుచరుడు) 
» కంటికి కన్ను పంటికి పన్ను-బాబిలోనియా నాగరికత 
» రాజు భగవంతుని వారసుడు, చట్టం రాజు నుంచి ఆవిర్భవిస్తుంది-జేమ్స్ I 
» యుద్ధం ప్రష్యా దేశంలో ఒక జాతీయ పరిశ్రమ-మిరాబో 
» ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ముందు ఈజిప్టు పిరమిడ్లు వెలవెలబోతాయి-వోల్టెర్ 
» సంతృప్తి చెందిన మూర్ఖుని కంటే అసంతృప్తితో ఉన్న సోక్రటీస్ నయం-జె.ఎల్. మిల్ 
» ఈ సెబాస్టపోల్ బురద నుంచి నూతన ఇటలీ ఉత్పన్నమవుతుంది-కౌంట్ కవూర్ 
» నేను ఉపన్యాసాన్ని ఇవ్వలేను కానీ ఇటలీని సమైక్యపరచగలను-కౌంట్ కవూర్ 
» ప్రాచీన చరిత్ర రచనకు ఉపయోగపడే మానవ అస్థిపంజరాలు, పుర్రెలు, శిలాజాలు అనే ఆధార వస్తువుల్ని ప్రాచీన కాలం మనుషులుగా వర్ణించవచ్చు-మార్టిమర్ వీలర్ 
» ప్రపంచ ఆధిపత్యమో లేదా పతనమో-రెండో కైజర్ విలియం 
» నేను న్యాయాన్ని ప్రేమించాను, అన్యాయాన్ని నిరసించను. అందువల్లే ఈ విధంగా ప్రవాసంలో మరణిస్తున్నాను-గ్రేగరి VII 
» విప్లవం రోగం వంటిది, అగ్ని పర్వతంలాంటిది, పుట్టుకురుపు వంటిది-ఎటర్నిక్ 
» మానవ పరిణామ క్రమాన్ని ఒక గంట సినిమాగా తీస్తే అందులో 59 నిమిషాలు శిలాయుగానికే సరిపోతుంది