మానవుల్లో ప్రొటోజోవాల వల్ల వచ్చే వ్యాధులు

 మలేరియా » 'ప్లాస్మోడియం' అనే ప్రొటోజోవా కారకంగా పనిచేస్తుంది.


» ఆడ ఎనాఫిలిస్ దోమకాటు వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.» కాలేయం ఈ వ్యాధి ప్రభావానికి గురవుతుంది.వ్యాధి లక్షణాలు: » తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కీళ్ల వాపులు, ప్లీహం ఉబ్బడం, రక్త కణాలు విచ్ఛిన్నమవడం. » చార్లెస్ లావెరిన్ 'మలేరియా పరాన్నజీవి'ని 1880లో తొలిసారిగా కనుక్కున్నారు.


» 'సర్ రోనాల్డ్ రాస్' మలేరియా వ్యాధిపై తన ప్రయోగాల్ని 1897లో సికింద్రాబాద్‌లో నిర్వహించారు.» తన ప్రయోగాల్లో ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి సంక్రమిస్తుందని తేలింది.» ఈ వ్యాధి చికిత్సలో క్వినైన్, క్లోరోక్విన్, ప్రైమాక్విన్ అనే మందుల్ని వాడతారు. » క్వినైన్‌ను సింకోనా అనే చెట్టు బెరడు నుంచి తయారుచేస్తారు. » మురుగు నీటిలో దోమ గుడ్లను, లార్వాలను సంహరించడానికి 'గాంబూసియా' అనే చేపలను పెంచుతారు. » భారత ప్రభుత్వం 'జాతీయ మలేరియా నిర్మూలన పథకం'ను అమలు చేస్తోంది. వెజనైటిస్ » 'ట్రైకోమోనాస్ ఎజైనాలిస్' అనే ప్రొటోజోవా ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తుంది. » లైంగిక సంబంధాలు, టాయ్‌లెట్లు, టవళ్ల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. » ప్రభావితమయ్యే భాగం యోని. వ్యాధి లక్షణాలు: » యోని భాగంలో దురద, వాపు ఉంటుంది. యోని నుంచి పసుపు రంగు ద్రవం విడుదలవుతుంది. జియోర్డియాసిస్ » దీన్నే 'అతిసారం' అని కూడా అంటారు. » 'జియార్డియో ఇంటెస్టెనాలిస్' అనే ప్రొటోజోవా ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తుంది. » మల మూత్రాలు, కలుషితమైన నీరు, ఆహారాల ద్వారా సంక్రమిస్తుంది. » ఈ వ్యాధి వల్ల పైత్యనాళం, ఆంత్రమూలం, వెజైనమ్ పైభాగం ప్రభావానికి గురవుతాయి. వ్యాధి లక్షణాలు: » జిగట విరేచనాలు, జ్వరం, రక్తహీనత, అలర్జి, కొవ్వు శోషణ సరిగ్గా లేకపోవడం. అమీబియాసిస్ » 'ఎంటమిబా హిస్టోలైటికా' అనే ప్రోటోజోవా జీవి ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తుంది.


» మల మూత్రాదులు, కలుషిత ఆహారం, కలుషిత నీరు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి.» ఈ పరాన్నజీవి మానవుని పేగులో ఆవాసం ఏర్పరచుకొని అక్కడి కణజాలాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా రక్తంతో కూడిన విరేచనాలవుతాయి.» కాలేయం, మెదడు, ప్లీహం ఈ వ్యాధి వల్ల ప్రభావితమవుతాయి. వ్యాధి లక్షణాలు: » రక్త విరేచనాలు, జిగట విరేచనాలు; జననావయవాలు, చర్మంపై పుండ్లు ఏర్పడటం; పొత్తి కడుపు నొప్పి; కాలేయం, మెదడు, ప్లీహంలలో పుండ్లు ఏర్పడటం.  బ్లాక్ సిక్‌నెస్ » లీష్మానియా డోనోవాని అనే ప్రొటోజోవా జీవి వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. » 'సాండ్' అనే ఈగ కాటు ఈ వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది. » ఈ వ్యాధినే బ్లాక్ ఫీవర్, డండం జ్వరం, మృత్యు జ్వరం, కాలా అజర్ అని కూడా అంటారు. » ఈ వ్యాధి ఎక్కువగా బిహార్, అసోం ప్రాంతాల్లో కనిపిస్తుంది. వ్యాధి లక్షణాలు: » సాండ్ ఈగ కాటు వేసిన భాగాల్లో పుండ్లు ఏర్పడటం, బరువు తగ్గడం, ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గిపోవడం, జ్వరం; కాలేయం, ప్లీహం క్షీణించడం, కామెర్లు, చర్మంపై నల్లని మచ్చలు ఏర్పడతాయి. అతి నిద్ర వ్యాధి » 'ట్రిపనోసోమా గాంబియన్సీ' అనే ప్రొటోజోవా జీవి వల్ల సంక్రమిస్తుంది. » సిసి ఈగ కాటు ఈ వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది. » ఈ వ్యాధి ఎక్కువగా ఆఫ్రికాలో కనిపిస్తుంది. వ్యాధి లక్షణాలు: » తీవ్రమైన తలనొప్పి, మెడ, వెన్నులోని గ్రంథులు వాయడం; కీళ్లనొప్పులు, కనురెప్పలు వాయడం; ఆకలి మందగించడం, అతిగా నిద్రరావడం, ఏ పనీ చేయాలని అనిపించకపోవడం. » ఈ వ్యాధి బాధితుడు చివరకు కోమా స్థితిలోకి వెళ్లిపోతారు. మరణం సంభవిస్తుంది. ఓరియంటల్ సోర్స్ లేదా ఢిల్లీ బాయిల్స్ » లీష్మానియట్రోపికా అనే ప్రొటోజోవా జీవి వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. » 'సాండ్' అనే ఈగ కాటు ఈ వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది. వ్యాధి లక్షణాలు: ముఖం, కాళ్లు, చేతుల మీద పుండ్లు ఏర్పడుతాయి.