ముఖ్యమైన ఆపరేషన్లు
ఆపరేషన్ పేరు | ఆపరేషన్ ఉద్దేశం |
» రెయిన్ బో ఈస్ట్ | 2004 డిసెంబరు 26న వచ్చిన సునామీ బాధితుల సాయం కోసం మనదేశ నౌకాదళం, శ్రీలంక చేపట్టిన కార్యక్రమం. |
» ఆపరేషన్ పవన్ | శ్రీలంలోని భారత శాంతి స్థాపక దళ కార్యక్రమాలు |
» ఆపరేషన్ రెడ్ డాన్ | ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను పట్టుకోడానికి అమెరికా సైన్యం చేపట్టింది. |
» ఆపరేషన్ ఓవర్ లోడ్ | ఫ్రాన్స్ ను నాజీల నుంచి విముక్తం చేయడానికి అమెరికా చేపట్టిన సైనికచర్య. |
» ఆపరేషన్ ఈగల్ | శ్రీలంకలోని తమిళులకు ఆహార పదార్థాలు, వైద్య సదుపాయాలు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి భారత శాంతిస్థాపక దళం చేపట్టిన కార్యక్రమం. |
» ఆపరేషన్ లీప్ ఫార్వర్డ్ | ఎల్.టి.టి.ఇ (లిబరేషన్ ఆఫ్ తమిళ ఈలం) స్థావరాలను ధ్వంసం చేయడానికి శ్రీలంక సైన్యం, వైమానిక, నౌకాదళాలు సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం. |
» ఆపరేషన్ ఆల్ క్లియర్ | భూటాన్ లోని భారత వ్యతిరేక శక్తులైన ఉల్ఫా, కమటాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ల కోసం చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ తొపక్ | మన దేశ యువకులకు అక్రమంగా సైనిక శిక్షణ ఇచ్చి మన దేశంలో అలజడులు సృష్టించడానికి పాకిస్థాన్ అధ్యక్షుడు 1988 లో ఏర్పాటు చేసింది. |
» ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ | అల్ ఖైదా ఉగ్రవాద సంస్థను అరికట్టడానికి అమెరికా చేపట్టిన సైనిక చర్య. |
» ఆపరేషన్ సన్ షైన్ | 1995లో ఎల్.టి.టి.ఈ స్థావరమైన జాఫ్నాపై శ్రీలంక సైన్యం చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ చెక్ మేట్ | ఎల్.టి.టి.ఈ కి వ్యతిరేకంగా భారత శాంతిదళాలు తీసుకున్న చర్యలు. |
» ఆపరేషన్ డిజర్ట్ ఫాక్స్ | ఇరాక్ పై దాడికి అమెరికా వైమానిక దళం చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ స్యార్ యర్ | ఇరాక్ లోని ఉగ్రవాదులను నాశనం చేయడానికి అమెరికా వైమానిక దళం 2006 లో చేపట్టిన దాడులు. |
» ఆపరేషన్ రెస్టోర్ హోష్ | సోమాలియాలో కరవు నివారణ కోసం యూఎన్ వో చేపట్టిన చర్యలు. |
» ఆపరేషన్ సైలెన్స్ | లాల్ మసీదులోని తీవ్ర వాదులను, మత ఛాందసులను నిరోధించడానికి పాకిస్థాన్ సైన్యం చేసిన కార్యక్రమం |
» ఆపరేషన్ పుష్ బాల్ | బంగ్లాదేశ్ నుంచి భారత దేశంలోకి వలస వచ్చిన వారిని వెనక్కి పంపే కార్యక్రమం |
» ఆపరేషన్ ఖఖరి | రివల్యూషనరీ యునైటెడ్ ఫ్రంట్ కు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి చేపట్టిన చర్య ఇది. సియెర్రాలియోన్ లో జరిగింది. 222 మంది భారత సైనికులను విడిపించడానికి ఈ చర్య చేపట్టారు. |
» ఆపరేషన్ డెవలప్ మెంట్ ఎఫర్ట్ | బంగ్లాదేశ్ లోని తుపాను బాధితుల కోసం చేపట్టిన ఆపరేషన్ ఇది. అమెరికా నావికా దళాలు దీన్ని నిర్వహించాయి. |
» ఆపరేషన్ ఎర్త్ క్వేక్ | ఎల్ టీటీఈ తీవ్రవాదులను నాశనం చేయడానికి శ్రీలంక సైన్యం ఈ చర్యను చేపట్టింది. |
» ఆపరేషన్ జాయింట్ ఎండీవర్ | నాటో ఆధ్వర్యంలో శాంతి స్థాపన కోసం బోస్నియాలో జరిగిన కార్యక్రమం. |
» ఆపరేషన్ అనకొండ | తోరాబోరా గుహల్లో దాక్కొని ఉన్న అల్ ఖైదా తీవ్రవాదులను చంపడానికి అమెరికా ఈ ఆపరేషన్ నిర్వహించింది. |
» ఆపరేషన్ ఒడిస్సీడాన్ | అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా తదితర దేశాల సైన్యంతో కూడిన అంతర్జాతీయ దళాలు లిబియాపై చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ జరోనిమా | అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ను చంపడానికి అమెరికా సైన్యాలు చేపట్టిన కార్యక్రమం. |
» ఆపరేషన్ ఖంజర్ | తాలిబన్ ల ఏరివేతకు అమెరికా సైన్యం, అప్ఘానిస్థాన్ సైన్యం సంయుక్తంగా చేపట్టిన చర్య. |
జాతీయ స్థాయిలో చేపట్టిన కొన్ని ముఖ్యమైన ఆపరేషన్లు | |
» ఆపరేషన్ విజయ్ | 1999 మే 14న కార్గిల్ లో అక్రమంగా చొరబడిన వారిని నిరోధించడానికి భారత సైన్యం చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ టోర్నడో | ముంబయిలో తీవ్రవాదుల దాడి జరిగినప్పుడు నారీమన్ హోటల్లో చిక్కుకున్న బందీలను విడిపించడానికి సైన్యం నిర్వహించిన చర్య. |
» ఆపరేషన్ బ్లూ స్టార్ | అమృతసర్ లోని స్వర్ణదేవాలంలో ఉన్న తీవ్రవాదులను చంపడానికి 1984లో భారత సైన్యం చేపట్టిన చర్య ఇది. |
» ఆపరేషన్ సైక్లోన్ | ముంబయి నగరంపై 2009 సంవత్సరం నవంబరు 26న జరిగిన దాడిలో తాజ్ హోటల్ లో దాక్కున ఉగ్రవాదులను నాశనం చేయడానికి నిర్వహించిన కార్యక్రమం. |
» ఆపరేషన్ కోబ్రా | జమ్మూ-కశ్మీర్ లో తీవ్రవాదుల ప్రాబల్య నిరోధానికి చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ పరాక్రమ్ | భారత పార్లమెంటుపై 2001లో దాడి జరిగినప్పుడు తలెత్తిన అవాంఛనీయ పరిస్థితులు, ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ సరిహద్దులోకి సైన్యాన్ని తరలించే చర్య. |
» ఆపరేషన్ గుడ్ విల్ | జమ్మూ-కశ్మీర్ లోని ప్రజల విశ్వాసాన్ని సంపాదించడానికి భారత సైన్యం చేపట్టిన కార్యక్రమం. |
» ఆపరేషన్ సెర్చ్ | ప్రత్యేక ఖలిస్థాన్ దేశం కోసం స్వర్ణదేవాలయం కేంద్రంగా పోరాడుతున్న ఖలిస్థాన్ తీవ్రవాదులను నిరోధించడానికి భారత సైన్యం చేసిన చర్య. |
» ఆపరేషన్ కూంబింగ్ -1 | పంజాబ్ లో తీవ్రవాదుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో వారిని నిరోధించడానికి చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ ఉడ్ రోజ్ | 1984లో పంజాబ్ లో తీవ్రవాదుల ఏరివేత చర్య |
» ఆపరేషన్ షాప్ | 1984లో స్వర్ణ దేవాలం మినహా మిగతా గురుద్వారాలలో చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ బ్లాక్ థండర్ | 1988లో స్వర్ణ దేవాలయం నుంచి తీవ్రవాదుల ఏరివేత. |
» ఆపరేషన్ రక్షక్ 1, 2 | పంజాబ్ లో తీవ్రవాదుల అరాచకాలకు అడ్డుకట్ట వేసి, అక్కడ ప్రశాంత ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ నైట్ డామినెన్స్ | పంజాబ్ లో రాత్రి వేళల్లో గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడం. |
» ఆపరేషన్ ఫైనల్ ఎసాల్ట్ | పంజాబ్ లో ఉగ్రవాద అణచివేత చర్యలు. |
» ఆపరేషన్ విన్ ఓవర్ | పంజాబ్ లో ప్రజల అభిమానాన్ని పొందడానికి సైన్యం చేపట్టిన కార్యక్రమం. |
» ఆపరేషన్ హంట్ డౌన్ | సరిహద్దు భద్రతా దళం, కశ్మీర్ లోని పోలీసులతో కలిసి కశ్మీర్ లోని ఉగ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన ఆపరేషన్. |
» ఆపరేషన్ టైగర్ | జమ్మూ-కశ్మీర్ లో ఉగ్రవాద నిరోధానికి చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ ఫాక్స్ | జమ్మూ – కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి నిర్వహించిన కార్యక్రమం ఇది. |
» ఆపరేషన్ విక్రమ్ | ఉగ్రవాదుల నిర్మూలనకు, శాంతి స్థాపనకు జమ్మూ-కశ్మీర్ లో నిర్వహించిన సైనిక చర్య. |
» ఆపరేషన్ క్రాంతి | అసోమ్ లో చెలరేగిన తీవ్రవాదులను నిర్మూలించి ప్రజలకు రక్షణ కల్పించడానికి భారత సైన్యం ఈ చర్య చేపట్టింది. |
» ఆపరేషన్ భజరంగ్ | 1980లో అసోమ్ లో ఉల్ఫా తీవ్రవాదుల ఏరివేతకు సైన్యం చేపట్టిన చర్య ఇది. ఇది విఫలమైంది. |
» ఆపరేషన్ రైనో | ఆపరేషన్ భజరంగ్ విఫలం కావడంతో అసోమ్ తీవ్రవాదలను అణచివేయడానికి చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ క్లౌడ్ బరస్ట్ | ఇది కూడా అసోమ్ లోని తీవ్రవాదుల నిర్మూలన కోసం చేపట్టిందే. |
» ఆపరేషన్ బ్లూ ప్రింట్ | ఉల్ఫా తీవ్రవాదులు అసోమ్ లో చేస్తున్న కార్యకలాపాలను వెలుగులోకి తీసుకురావడానికి చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ సహయోగ్ | అసోంలో ప్రజల అభిమానాన్ని సంపాదించడం కోసం భారత సైన్యం నిర్వహించిన కార్యక్రమం. |
» ఆపరేషన్ అగ్ని | ఉత్తర ప్రదేశ్ లోని తెరాయ్ ప్రాంతంలోని తీవ్రవాదుల ఏరివేతకు చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ సైకో | హజ్రత్ మహల్ మసీదులో దాక్కున్న తీవ్రవాదులకు ఆహార పదార్థాలు అందకుండా అడ్డుకుంటూ వారిపై ఒత్తిడి పెంచడానికి చేపట్టిన సైనిక చర్య. |
» ఆపరేషన్ పోలో | 1948లో హైదరాబాద్ సంస్థానం స్వాధీనానికి భారత ప్రభుత్వం చేపట్టిన పోలీసు చర్య. |
» ఆపరేషన్ లోటస్ | బోఫోర్స్ కుంభకోణంలోని రహస్యాలను ఛేదించడానికి చేపట్టిన పోలీసు కార్యక్రమం. |
» ఆపరేషన్ శాండల్ ఫాక్స్ | గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను పట్టుకోడానికి చేపట్టిన పోలీసు చర్య ఇది. |
» ఆపరేషన్ మిడ్ నైట్ | సెంట్రల్ రిజర్వ్ పోలీసు, పంజాబ్ పోలీసులు 1987లో స్వర్ణ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన కార్యక్రమం. |
» ఆపరేషన్ కోకూన్ | గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను బంధించడానికి తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన చర్య. |
» ఆపరేషన్ ధన్వంతరి | దొంగ మందులను తయారు చేస్తున్న 4 పరిశ్రమలను గుర్తించి వాటిని నాశనం చేయడానికి బిహార్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. |
» ఆపరేషన్ త్రీ స్టార్ | పార్లమెంట్ పై దాడి జరిగిన కేసులో ప్రధాన నిందితుడు అఫ్జల్ గురును ఉరి తీయడానికి చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ ఎక్స్ | ముంబయిలో తీవ్రవాదుల దాడి కేసులో పట్టుబడిన అజ్మల్ కసబ్ ను పుణేలోని ఎరవాడ జైల్లో రహస్యంగా ఉరి తీసిన చర్య. |
ఇతర ముఖ్యమైన ఆపరేషన్లు | |
» ఆపరేషన్ తోడర్ మల్ | బిహార్ లో భూ సంస్కరణలను వేగంగా, నిష్పాక్షికంగా నిర్వహించడానికి చేపట్టిన కార్యక్రమం. |
» ఆపరేషన్ గ్రీన్ గోల్డ్ | వెదురు ఉత్పత్తులను పెంచడానికి చేపట్టిన చర్య. |
» ఆపరేసన్ బ్లూ రెమ్యూషన్ | చేపల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం. |
» ఆపరేషన్ ఫ్లడ్ | 1970లో భారత దేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. |
» ఆపరేషన్ టీ-14 | పెరిగిపోతున్న అవినీతికి వ్యతిరేకంగా 1984లో నిర్వహించిన చర్య. |
» ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ | ప్రాథమిక విద్యను పరిపుష్టం చేయడానికి చేపట్టిన కార్యక్రమం ఇది. దీని ద్వారా ప్రాథమిక పాఠశాలల్లో కనీస వసతులు కల్పించారు. |
» ఆపరేషన్ – 100 | కార్లకు నల్లటి అద్దాలు ఉపయోగించ కూడదనే నిబంధనలతో హైదరాబాద్ పోలీసులు చేపట్టిన కార్యక్రమం ఇది. |
» ఆపరేషన్ సేవా | తీవ్రవాదం భయంతో జమ్మూ-కశ్మీర్ ను విడిచి వెళ్లిన ప్రజలకు సహాయం చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం. |
» ఆపరేషన్ గజ | 2008లో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు సృష్టించిన అలజడిని నిరోధించడానికి అటవీశాఖ చేపట్టిన చర్య ఇది. |
» ఆపరేషన్ ఎక్స్ లెన్స్ | 1990 ఏసియన్ క్రీడల్లో ఉన్నత ప్రతిభా ప్రదర్శన లక్ష్యంగా భారత క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం. |
» ఆపరేషన్ దుర్యోధన్ | పార్లమెంట్ లో ప్రశ్నలు అడగటానికి పదకొండు మంది ఎంపీలు డబ్బు తీసుకుంటున్న విషయాన్ని ఆజ్ తక్ టీవీ ఛానల్, కోబ్రా పోస్టు న్యూస్ పోర్టల్ సంయుక్తంగా నిర్వహించిన చర్య ఇది. |
» ఆపరేషన్ చక్రవ్యూహ్ | ఎంపీ లాడ్స్ పథకం కింద పనులు చేపట్టేందుకు అక్రమ మార్గాలను ఎంచుకున్న ఎంపీల దురాగతాలను బహిర్గతం చేయడానికి డెడికేటర్ ఇన్వెస్టిగేటివ్ గిల్డ్, స్టార్ న్యూస్ ఉమ్మడిగా చేపట్టిన చర్య. |