జాతీయ, అంతర్జాతీయ తొలి సంఘటనలు - తొలి వ్యక్తులు

 సంఘటన వ్యక్తి/ వ్యక్తులు » ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ-లండన్ (1863) » ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ-లండన్ (1890)» ప్రపంచంలో తొలి గ్రంథం-రుగ్వేదం» భారత్‌లో మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్-అప్సర (1956)» తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు-ఇండో - గ్రీకులు» భారత్‌లో తొలి పత్రిక-బెంగాల్ గెజిట్ (1780)» దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం-ఆంధ్రప్రదేశ్ (1956)» ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం-ముంబయి» భారత్‌లో మొదటి మహిళా కళాశాల-బెతూన్ కళాశాల, కలకత్తా (1879)» దేశంలో తొలి చమురు బావి-దిగ్బోయ్ (అస్సాం, 1890)» ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం-జపాన్ (టోక్యో, 1964)» మానవుడు మొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు-కుక్క


» మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం-రాగి» దేశంలో 100 శాతం కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం-చామ్రవట్టం (కేరళ)» భారత్‌లో తొలి నాగరికత-సింధు » భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన స్థలం-ముంబయి (1885)» తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం-జనతా ప్రభుత్వం (1977 - 79)» మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం-న్యూజిలాండ్ (1893)


» తొలి క్లోన్‌డ్ జంతువు-డాలీ అనే గొర్రె (1996)» భారత్‌లో తొలిసారిగా భారజల ఉత్పత్తిని ప్రారంభించిన కేంద్రం-నంగల్ (పంజాబ్)» భారత్‌లో తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా-పాలక్కడ్ (కేరళ)» భారతదేశంలో సౌరశక్తితో విద్యుదీకరించిన తొలి గ్రామం-చోగ్లామ్‌సార్ (జమ్ము, కాశ్మీర్)» తొలి ఇ-నెట్‌వర్క్ జిల్లా-మలప్పురం (కేరళ)» భారత్‌లో వైర్‌లెస్ కనెక్టివిటీ ఉన్న మొదటి నగరం-మైసూర్ (కర్ణాటక)» భారత్‌లో మొదటి సమాచార సాంకేతికత ఉన్న జిల్లా-పాలక్కడ్ (కేరళ)» భారత్‌పై దండెత్తిన తొలి యూరోపియన్-అలెగ్జాండర్ (క్రీ.పూ. 326)» భారత్‌లో పూర్తిగా విద్యుదీకరించిన తొలి నగరం-బెంగళూరు (1906)» భారత్‌లో తొలి మహిళా విశ్వవిద్యాలయం-ఇండియన్ ఉమెన్స్ యూనివర్సిటీ (పుణె)» మొదటి యాంటీ బయోటిక్ డ్రగ్-పెన్సిలిన్» భారత్‌లో మొదటి అణు పరీక్ష-పోఖ్రాన్ (రాజస్థాన్ - 1974)» భారత్‌లో తొలి సైన్స్ నగరం-కలకత్తా» భారత్ ప్రయోగించిన మొదటి ఉపగ్రహం-ఆర్యభట్ట (1975)» కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి కృత్రిమ ఉపగ్రహం-స్పుత్నిక్ (రష్యా - 1957)» ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ-రజియా సుల్తానా» భారత్‌లో మొదటి రైల్వే లైను-ముంబయి నుంచి థానే (1853)» ఇండియాలో మొదటి టెలిగ్రాఫ్ లైను-కలకత్తా, డైమండ్ హార్బర్‌ల మధ్య (1851)» శని గ్రహంపైకి పంపిన తొలి స్పేస్ క్రాఫ్ట్-కేసినీ హ్యుగిన్స్ (2004)» భారత్ మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం-ఆపిల్ (1981)» భారత్ ప్రయోగించిన తొలి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్-PSLVC - 2» భారత్‌లో తొలి తపాలా కార్యాలయం ఉన్న నగరం-కలకత్తా (1727)» మనదేశంలో రేడియో ప్రసారాలు తొలిసారిగా ప్రసారమైన ప్రాంతం-ముంబయి, కలకత్తాల మధ్య (1927)» ఇండియాలో తొలి మూగ (మూకి) సినిమా-రాజా హరిశ్చంద్ర (1913)» ప్రపంచంలో మొదటి టాకీ సినిమా-ది జాజ్ సింగర్ (1927)» భారత్‌లో మొదటి టాకీ సినిమా-ఆలం ఆరా (1931)» పూర్తినిడివి ఉన్న మొదటి కార్టూన్ చిత్రం-స్నోవైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్» భారతదేశంలో మొదటి ఉక్కు కర్మాగారం-టాటా ఐరన్, స్టీల్ కంపెనీ (1907)» విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం-మదర్ ఇండియా» భారతదేశ మొదటి యోగా శాస్త్రవేత్త-పతంజలి» భారతదేశంలో మొదటిసారిగా స్థాపించిన పోలీసు మ్యూజియం-ఘజియాబాద్ (ఉత్తర్‌ ప్రదేశ్)» ప్రపంచంలో మొదటిసారిగా నిర్వహించిన అందాల పోటీలు-కార్నిత్ (గ్రీకు క్రీ.పూ. 700)» మొదటి కంపాక్ట్ డిస్క్-సోనీ, ఫిలిప్స్ కంపెనీలు తయారు చేశాయి (1978)» భారత్ తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్-ఇంగ్లండ్‌తో (1932)» భారత్ తొలి ఎలక్ట్రిక్ రైలు-ముంబయి నుంచి వి.టి. కుర్లా వరకు (1925)» మొదటి ఆటంబాంబు-లిటిల్ బాయ్ (1945)» ప్రపంచంలో మొదటిసారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం-భారతదేశం» భారత దేశాన్ని సందర్శించిన తొలి చైనీస్ యాత్రికుడు-పాహియాన్» భారత దేశంలో శాసనాలు వేయించిన తొలి చక్రవర్తి-అశోకుడు» దేశంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం-పంజాబ్» బోర్లాగ్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ-డాక్టర్ అమితా పటేల్ (1992)» భార‌త‌ దేశ మొదటి రాష్ట్రపతి-డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ (1950 - 1962)» భారత దేశ మొదటి ఉపరాష్ట్రపతి-సర్వేపల్లి రాధాకృష్ణన్ (1952 - 62)» భారత దేశ మొదటి ప్రధానమంత్రి-జవహర్‌లాల్ నెహ్రూ (1947 - 64)» భారత దేశ మొదటి ఉప ప్రధానమంత్రి-సర్దార్ వల్లభాయ్ పటేల్ (1947 - 50)» సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి-హీరాలాల్ జె.కానియా (1950 - 51)» సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి-మీరా సాహెబ్ ఫాతిమా బీబీ (1989)» భారత దేశ తొలి మహిళా అడ్వకేట్-కోర్నేషియా సొరాబ్జి (కోల్‌క‌తా 1894)» భారత దేశ హైకోర్టులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి-లీలాసేథ్ (ఢిల్లీ)» భారత్‌లో హైకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తి-అన్నాచాంది» స్వాతంత్య్రం రాకముందు భారత దేశ మొదటి గవర్నర్ జనరల్-విలియం బెంటింగ్ (1828 - 35)» భారతదేశ చివరి గవర్నర్ జనరల్, మొదటి వైస్రాయ్-లార్డ్ కానింగ్ (1856 - 62)» స్వతంత్ర భారత మొదటి, చివరి గవర్నర్ జనరల్-మౌంట్ బాటన్ (1947 - 48)» స్వతంత్ర భారత మొదటి, చివరి భారతీయ గవర్నర్ జనరల్-సి. రాజగోపాలాచారి


» ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ-విజయలక్ష్మి పండిట్ (1953)» భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలైన మొదటి మహిళ-అనిబిసెంట్ (1917, కలకత్తా)» భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ-సరోజినీ నాయుడు (1925 - కాన్పూర్)


» భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు-ఉమేష్ చంద్ర బెనర్జి (1885 - బొంబయి)» భారత జాతీయ కాంగ్రెస్ తొలి ముస్లిం అధ్యక్షుడు-బద్రుద్దీన్ త్యాబ్జీ (1887 - మద్రాసు) » భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు-పి. ఆనందాచార్యులు (1891 - నాగపూర్)» వరుసగా రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు అయిన తొలి వ్యక్తి-రాస్ బిహారీ ఘోష్ (1907 - సూరత్, 1908 - మద్రాస్)


» విడివిడిగా రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు అయిన తొలి వ్యక్తి-దాదాభాయ్ నౌరోజీ (1886 - కలకత్తా, 1906 - కలకత్తా)» భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కువసార్లు జరిగిన మొదటి పట్టణం-కలకత్తా (1886, 1906, 1917, 1928)» భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు-జార్జి యూల్ (1888 - అలహాబాదు) » భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి పార్శీ మతస్తుడు-దాదాభాయ్ నౌరోజీ» బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు-దాదాభాయ్ నౌరోజీ» భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు హాజరైన తొలి మహిళ-కాదంబినీ గంగూలీ (1901)» భారత్‌లో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబి-బేబి హర్ష (1986)» రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి గవర్నరు-ఒస్‌బ‌ర్న్ స్మిత్ (1935 - 37)» ఆర్‌బీఐ తొలి భారతీయ గవర్నరు-సి.డి. దేశ్‌ముఖ్ (1943 - 49)» ఆర్‌బీఐ తొలి మహిళా డిప్యూటీ గవర్నరు-కె.జె. ఉదేశి» వెండితెరపై మొదటి నటి-దేవికారాణి» గుండె మార్పిడి చికిత్స నిర్వహించిన మొదటి భారతీయుడు-డాక్టర్ వేణుగోపాల్» భారత రత్న పురస్కారం పొందిన మొదటి వ్యక్తులు-సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తుల రాజగోపాలచారి, సి.వి.రామన్ (1954)» భారతరత్న పొందిన తొలి మహిళ-ఇందిరాగాంధీ (1971)


» భారతరత్న అవార్డు పొందిన తొలి ఉప రాష్ట్రపతి-సర్వేపల్లి రాధాకృష్ణన్ (1954)» భారతరత్న అవార్డు పొందిన తొలి శాస్త్రవేత్త-సి.వి.రామన్ (1954)» భారతరత్న అవార్డు పొందిన మొదటి ఇంజినీర్-మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1955) » భారతరత్న అవార్డు పొందిన తొలి ప్రధాని-జవహర్‌లాల్ నెహ్రూ (1955)


» భారతరత్న అవార్డు పొందిన తొలి రాష్ట్రపతి-బాబూ రాజేంద్రప్రసాద్ (1962)» మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి-లాల్‌బహదూర్ శాస్త్రి (1966)» భారతరత్న అవార్డు పొందిన తొలి విదేశీయుడు-ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ (1987) » భారతరత్న అవార్డు పొందిన తొలి సినిమా నటుడు-ఎం.జి. రామచంద్రన్ (1988)» భారతరత్న అవార్డు పొందిన తొలి సినిమా దర్శకుడు-సత్యజిత్ రే (1992)


» సంగీతంలో భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి, తొలి మహిళ-ఎం.ఎస్. సుబ్బులక్ష్మి(1998)» పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి-డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1969)» పదవిలో ఉండగా మరణించిన తొలి ఉపరాష్ట్రపతి-కృష్ణకాంత్ (2002) » తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఉపరాష్ట్రపతి-వరాహగిరి వెంకటగిరి (1969 మే - 1969 జులై)» మొదటి ముస్లిం రాష్ట్రపతి-డాక్టర్ జాకీర్ హుస్సేన్» మొదటి సిక్కు రాష్ట్రపతి-జ్ఞానీ జైల్‌ సింగ్» అత్యధిక కాలం రాష్ట్రపతిగా పనిచేసిన తొలి రాష్ట్రపతి-డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్» ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి పదవి చేపట్టిన మొదటి వ్యక్తి-డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్» మొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రాష్ట్రపతి-డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (1962)» అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా వ్యవహరించిన రాష్ట్రపతి-డాక్టర్ జాకీర్ హుస్సేన్» మొదటి కాంగ్రెసేతర రాష్ట్రపతి-వరాహగిరి వెంకటగిరి» స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మొదటి రాష్ట్రపతి-వరాహగిరి వెంకటగిరి» సుప్రీంకోర్టులో సాక్షిగా హాజరైన మొదటి రాష్ట్రపతి-వరాహగిరి వెంకటగిరి» అతి ఎక్కువ ఆర్డినెన్స్‌లు జారీచేసిన రాష్ట్రపతుల్లో ప్రథముడు-ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్» ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి-ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్


» ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి-నీలం సంజీవరెడ్డి» పిన్న వయసులోనే (63 సంవత్సరాలు) రాష్ట్రపతి మొదటి వ్యక్తి-నీలం సంజీవరెడ్డి» ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా (ఆంధ్రప్రదేశ్), స్పీకర్‌గా పనిచేసి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి-నీలం సంజీవరెడ్డి


» తొలి దళిత రాష్ట్రపతి-కె.ఆర్. నారాయణన్» ఓటు హక్కు ఉపయోగించుకున్న తొలి రాష్ట్రపతి-కె.ఆర్.నారాయణన్ » తొలి మహిళా రాష్ట్రపతి-ప్రతిభా దేవీసింగ్ పాటిల్» అత్యధిక కాలం (2 పర్యాయాలు) (1952 - 62) ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి వ్యక్తి-డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్» తొలి ముస్లిం ఉపరాష్ట్రపతి-డాక్టర్ జాకీర్ హుస్సేన్» అతి తక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన వ్యక్తి-వరాహగిరి వెంకటగిరి» తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి ఉపరాష్ట్రపతి-వరాహగిరి వెంకటగిరి» ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి-జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా» పెద్ద వయసులో ఉపరాష్ట్రపతిగా (73 ఏళ్లు) వ్యవహరించిన తొలి వ్యక్తి-ఆర్.వెంకట్రామన్» అత్యధిక కాలం ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి-జవహర్ లాల్ నెహ్రూ (17 సంవత్సరాలు; 1947 - 64)» . పదవిలో ఉండగా మరణించిన మొదటి ప్రధాని-జవహర్‌లాల్ నెహ్రూ» ఆర్థికమంత్రి హోదాలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని-జవహర్‌లాల్ నెహ్రూ» విదేశాల్లో మరణించిన మొదటి ప్రధాని-లాల్‌బహదూర్‌శాస్త్రి» మొదటి మహిళా ప్రధాని-ఇందిరాగాంధీ


» ప్రధానిగా వ్యవహరిస్తూ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన మొదటి ప్రధాని-ఇందిరాగాంధీ (1977)» రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానిగా ఎన్నికైన మొదటి వ్యక్తి-ఇందిరాగాంధీ» అత్యధిక రాజ్యాంగ సవరణలు చేసిన మొదటి ప్రధాని-ఇందిరాగాంధీ » ఎక్కువసార్లు రాష్ట్రపతి పాలన విధించిన మొదటి ప్రధాని (48 సార్లు)-ఇందిరాగాంధీ» హత్యకు గురైన మొదటి ప్రధాని-ఇందిరాగాంధీ» అరెస్టు అయిన మొదటి ప్రధాని-ఇందిరాగాంధీ» మొదటి కాంగ్రెసేతర ప్రధాని-మొరార్జీ దేశాయ్» పెద్ద వయసులో ప్రధానిగా (81 ఏళ్లు) వ్యవహరించిన వ్యక్తి-మొరార్జీ దేశాయ్» ప్రధాని పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి-మొరార్జీ దేశాయ్» మొదటిసారిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి-చరణ్ సింగ్ » తన పదవీకాలంలో పార్లమెంటులో అడుగుపెట్టని ఏకైక ప్రధాని-చరణ్ సింగ్


» అతి పిన్న వయసులో (47 ఏళ్లు) ప్రధాని పదవిని అధిష్టించిన తొలి వ్యక్తి-రాజీవ్ గాంధీ» విశ్వాస తీర్మానం ద్వారా తొలగించబడిన ఏకైక ప్రధాని-విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్» ఎర్రకోట నుంచి ప్రసంగించని ఏకైక ప్రధాని-చంద్రశేఖర్ » దక్షిణ భారత దేశం నుంచి ప్రధాని అయిన మొదటి వ్యక్తి-పి.వి. నరసింహారావు» పార్లమెంటులో సభ్యత్వం లేకుండా ప్రధాని అయిన తొలి వ్యక్తి-పి.వి. నరసింహారావు» ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన మొదటి ప్రధాని-అటల్ బిహారీ వాజ్‌పేయ్» ‘వరల్డ్ స్టేట్స్‌మెన్’ అవార్డు పొందిన ఏకైక ప్రధాని-ఐ.కె. గుజ్రాల్» ప్రధానమంత్రి పదవిని అలంకరించిన మొదటి ఆర్థికవేత్త-మన్మోహన్ సింగ్» ఏకైక తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి-గుల్జారీలాల్ నందా» లోక్‌సభ తొలి స్పీకర్-గణేష్ వాసుదేవ్ మౌలాంకర్» లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన తొలి ఆంధ్రుడు-నీలం సంజీవరెడ్డి» రెండు లోక్‌సభలకు స్పీకర్‌గా చేసిన తొలి వ్యక్తి-డాక్టర్ బలరాం జక్కర్» లోక్‌సభకు తొలి దళిత స్పీకర్-జి.ఎం.సి. బాలయోగి» లోక్‌సభకు తొలి మహిళా స్పీకర్-మీరాకుమార్‌» భారత తొలి ఎన్నికల కమిషనర్-సుకుమార్ సేన్» భారత ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన తొలి ఆంధ్రుడు-ఆర్.ఎ.ఎస్. పేరిశాస్త్రి» భారత ఎన్నికల తొలి మహిళా కమిషనర్-వి.ఎస్. రమాదేవి» అతి తక్కువ కాలం ఎన్నికల కమిషనర్‌గా వ్యవహరించిన వ్యక్తి-వి.ఎస్. రమాదేవి (16 రోజులు)» మొదటి మహిళా గవర్నర్-సరోజినీ నాయుడు (ఉత్తర్ ప్రదేశ్, 1947 - 49)» మొదటి మహిళా ముఖ్యమంత్రి-సుచేతా కృపాలానీ (ఉత్తర్ ప్రదేశ్, 1963 - 67)» మొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి-మాయావతి (ఉత్తర్ ప్రదేశ్, 1995) » మొదటి దళిత ముఖ్యమంత్రి-దామోదరం సంజీవయ్య (ఆంధ్రప్రదేశ్, 1960 - 62)» ముఖ్యమంత్రి అయిన తొలి సినిమా నటుడు-ఎం.జి. రామచంద్రన్ (తమిళనాడు)» ముఖ్యమంత్రి అయిన తొలి స్వతంత్ర అభ్యర్థి-బిశ్వనాథ్ దేశ్ (1971) » అవినీతి కుంభకోణంపై అరెస్టు అయి జైలుకు వెళ్లిన తొలి ముఖ్యమంత్రి-జయలలిత (తమిళనాడు, 1996)» ప్రజలు ఎన్నుకున్న తొలి లెఫ్ట్ ప్రభుత్వాధినేత (ప్రపంచంలో కూడా)-నంబూద్రిపాద్ (కేరళ, 1957)» ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి హిజ్రా-షబ్మమ్ మౌసి (మధ్యప్రదేశ్, 2000)» ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయురాలు-భాను అథయా (1983)» ఆస్కార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు పొందిన తొలి భారతీయుడు-సత్యజిత్ రే (1992)» రామన్ మెగసెసె అవార్డు పొందిన తొలి భారతీయుడు-ఆచార్య వినోబా భావే (1958)» రామన్ మెగసెసె అవార్డు పొందిన తొలి మహిళ-మదర్ థెరిసా (1962)


» రామన్ మెగసెసె అవార్డు పొందిన తొలి ఆసియావాసి-ఆచార్య వినోబా భావే(1958)» రామన్ మెగసెసె అవార్డును మొదటిగా గ్రహించింది-ఆచార్య వినోబా భావే» సామాజిక నాయకత్వంలో రామన్‌మెగసెసె అవార్డును తొలిగా గ్రహించింది-ఆచార్య వినోబా భావే(1958) » రామన్‌మెగసెసె అవార్డు పొందిన తొలి తండ్రీకొడుకులు-బాబా ఆమ్టే (1985), ప్రకాష్ ఆమ్టే (2008)» రామన్ మెగసెసె అవార్డు పొందిన తొలి భార్యాభర్తలు-మందాకినీ ఆమ్టే (2008), ప్రకాశ్ ఆమ్టే (2008)» ఎమర్జంట్ లీడర్‌షిప్ అంశం కింద రామన్ మెగసెసె అవార్డు పొందిన తొలి భారతీయుడు-సందీప్ పాండే (2002)» జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి వ్యక్తి-శంకర కురూప్ (1965) (రచన: ఒడక్క జుల్, మలయాళం)» జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి మహిళ-ఆషాపూర్ణాదేవి (1976, ప్రథమ్, ప్రతిశ్రుతి, బెంగాలీ)» బుకర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయుడు-వి.ఎస్. నైపాల్ (1971)» బుకర్‌ప్రైజ్ పొందిన తొలి భారతీయ మహిళ-అరుంధతీ రాయ్ (ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, 1997)» పులిట్జర్ బహుమతి పొందిన తొలి భారతీయ మహిళ-ఝంపా లాహిరి (2000)» దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి వ్యక్తి-దేవికారాణి రోరిచ్ (1969)» దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి ఆంధ్రుడు-బి.ఎన్.రెడ్డి (1974)» బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన తొలి వ్యక్తి-ఇంద్రజిత్ గుప్తా (1993)


» ఎన్టీఆర్ అవార్డు పొందిన తొలి వ్యక్తి-అక్కినేని నాగేశ్వరరావు (1996)» వైశ్రాయ్ కౌన్సిల్ మొదటి భారతీయ సభ్యుడు-ఎస్.పి. సిన్హా» సుప్రీంకోర్టు మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి-కె.జి. బాలకృష్ణన్ (2007) » మహాభియోగ తీర్మానాన్ని ఎదుర్కొన్న తొలి, ఏకైక సుప్రీంకోర్టు న్యాయమూర్తి-జస్టిస్ వి. రామస్వామి (1993)» తొలి మహిళా మేజిస్ట్రేట్-ఓమన కుంజమ్మ» అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు-డాక్టర్ నాగేందర్ సింగ్» రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు-విశ్వనాథన్ ఆనంద్ (చదరంగం, 1991 - 94)» రాజీవ్‌ఖేల్‌రత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారిణి-కరణం మల్లేశ్వరి (1995)


» రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు పొందిన తొలి క్రికెటర్-సచిన్ టెండూల్కర్ (1997)» బాక్సింగ్‌లో రాజీవ్‌ఖేల్‌రత్న అవార్డు పొందిన తొలి మహిళ-మేరికోమ్ (మణిపూర్)» పరమవీర చక్ర అవార్డు పొందిన తొలి వ్యక్తి-సోమనాథ్ శర్మ » ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయుడు-టెన్సింగ్ నార్కే (1953, మే 29)» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయురాలు-బచేంద్రిపాల్ (1984)» ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన తొలి భారతీయురాలు-సంతోష్‌యాదవ్ (1993, మే 10)» ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న తొలి దక్షిణ భారతీయుడు-శేఖర్ బాబు (ఆంధ్రప్రదేశ్)» ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన తొలి వ్యక్తి-నవాంగ్ గొంబూ (1965)» ఎవరెస్ట్ శిఖరాన్ని ఆక్సిజన్ లేకుండా అధిరోహించిన తొలి వ్యక్తి-పూదోర్జి» తొలి భారతీయ ఐ.పి.ఎస్. అధికారి-సత్యేంద్రనాథ్ ఠాగూర్» తొలి మహిళా ఐ.ఎ.ఎస్. అధికారి-అన్నాజార్జ్ » తొలి మహిళా ఐ.పి.ఎస్. అధికారి-కిరణ్‌బేడి (1972)» తొలి మహిళా డి.జి.పి. అధికారి-కంచన్ చౌదరి భట్టాచార్య (ఉత్తరాఖండ్)» ఐక్యరాజ్యసమితి సివిల్ పోలీస్‌కు సలహాదారుడిగా నియమితులైన తొలి భారతీయ మహిళ-కిరణ్‌బేడి » భారతీయ రైల్వే బోర్డులో మొదటి మహిళా సభ్యురాలు-విజయలక్ష్మీ విశ్వనాథన్» తొలి మహిళా రాయబారి-విజయలక్ష్మి పండిట్ (మాజీ సోవియట్‌కు, 1947 - 49)» తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి-చోకిలా అయ్యర్» ఇంగ్లిష్‌ఛానెల్ ఈదిన తొలి మహిళ-ఆర్తిసాహా (1959)» ఇంగ్లిష్ ఛానెల్‌ను ఈదిన తొలి భారతీయుడు-మిహిర్‌సేన్ (1958)» ఇంగ్లిష్ ఛానెల్‌ను రెండుసార్లు ఈదిన తొలి భారతీయురాలు-బులా చౌదరి (2004)» సప్త సముద్రాల్లోని 7 జలసంధులను ఈదిన తొలి భారతీయురాలు-బులా చౌదరి (ప్రపంచంలోనే మొదటి వ్యక్తి)» జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన మొదటి భారతీయ మహిళ-ఆర్తి సాహా» అయిదు ఖండాల్లో సముద్రాలను ఈదిన తొలి మహిళ-బులా చౌదరి» స్వతంత్ర భారత పోస్టల్ స్టాంపుపై దర్శన మిచ్చిన తొలి వ్యక్తి-మహాత్మా గాంధీ (1948)» మొదటి భారతీయ మహిళా ఫొటో జర్నలిస్ట్-హోమియా వ్యారవల్లా (బాంబే క్రానికల్, 1938)» రైల్వే ఇంజిన్ డ్రైవర్ అయిన మొదటి భారతీయ మహిళ-సురేఖా యాదవ్ (ఇండియన్ రైల్వేస్, 1992)» నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు తొలి మహిళా అధ్యక్షురాలు-ఒమనా అబ్రహం (కొట్టాయం, కేరళ)» భారత్‌ను పాలించిన తొలి మహిళ-రజియా సుల్తానా (1236 - 1240)» అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు-రాకేష్ శర్మ (1984)» అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ టూరిస్ట్-సంతోష్ జార్జి (కేరళ)


» అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన తొలి మహిళ-కల్పనా చావ్లా» ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం పొందిన తొలి భారతీయుడు-ఖాషాబా జాదవ్ (1952, రెజ్లింగ్, కాంస్యం)» ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారతీయురాలు-కరణం మల్లేశ్వరి (2000, వెయిట్‌లిఫ్టింగ్, కాంస్యం) » ఒలింపిక్ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళ-పి.టి. ఉష (1984)» ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారతీయుడు-రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (2004, ఏథెన్స్, షూటింగ్)» ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు-అభినవ్ బింద్రా (2008, బీజింగ్, షూటింగ్)» భూగోళం చుట్టివచ్చిన మొదటి భారతీయుడు-లెఫ్టినెంట్ కల్నల్ కె.ఎస్. రావు» భూగోళం చుట్టివచ్చిన తొలి భారతీయ మహిళ-ఉజ్వల రాయ్


» చదరంగంలో తొలి భారతీయ గ్రాండ్‌మాస్టర్-విశ్వనాథన్ ఆనంద్» చదరంగంలో తొలి భారతీయ మహిళా గ్రాండ్ మాస్టర్-ఎస్. విజయలక్ష్మి (2000)» ప్రపంచ బిలియర్డ్స్ ట్రోఫీని గెలుచుకున్న తొలి భారతీయుడు-విల్సన్ జోన్స్ » ప్రపంచ అథ్లెటిక్స్‌లో పతకం పొందిన తొలి భారతీయ మహిళ-అంజూ బాబీ జార్జ్» అంటార్కిటికాను చేరిన తొలి భారతీయుడు-లెఫ్టినెంట్ రామ్‌చరణ్ (1960)» అంటార్కిటికాను చేరుకున్న తొలి భారతీయ మహిళ-మోహర్‌మూస్ (1976)» మొదటి భారతీయ ప్రపంచ సుందరి-రీటా ఫారియా (1966)» మొదటి భారతీయ విశ్వసుందరి-సుస్మితాసేన్ (1994)» మొదటి మిస్ ఇండియా-ప్రమీల (1947)» మొదటి మిస్ ఏసియా పసిఫిక్-దియామీర్జా (2000)» పద్మశ్రీ పురస్కారం అందుకున్న తొలి నటి-నర్గీస్ దత్» నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయుడు (ఆసియావాసి)-రవీంద్రనాధ్ ఠాగూర్ (1913)


» నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయ వనిత-మదర్ థెరిసా (శాంతి, 1971)» ఆసియాన్ గేమ్స్‌లో వ్యక్తిగత బంగారు పతకం పొందిన తొలి భారతీయ మహిళ-కమలజిత్ సంధూ (1970)» భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్-సి.కె. నాయుడు (1932) » స్వతంత్ర భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్-లాలా అమర్‌నాథ్ (1947 - 48)» తొలి టెస్ట్ సెంచరీ సాధించిన భారతీయుడు-లాలా అమర్‌నాథ్ (ఇంగ్లండ్‌పై)


» ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయుడు-వీరేంద్ర సెహ్వాగ్ (పాకిస్థాన్, 2004)» టెస్టుల్లో పదివేల పరుగులు పూర్తిచేసిన తొలి భారతీయుడు-సునీల్ గవాస్కర్» టెస్టుల్లో వన్డేల్లో పదివేల పరుగులు పూర్తిచేసిన తొలి భారతీయుడు-సచిన్ టెండూల్కర్ » టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయుడు-హర్భజన్ సింగ్ (ఆస్ట్రేలియాపై 2001)» భారతదేశ మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్-విలియం బెంటిక్» భారత్‌లో హత్యకు గురైన ఏకైక వైశ్రాయి-లార్డ్ మేయో (1872)» బెంగాల్ మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్-వారన్ హేస్టింగ్స్


» భారత్‌లో మొదటి పైలట్-జె.ఆర్.డి. టాటా (1929)» ఎయిర్ బస్ మొదటి భారతీయ మహిళా పైలట్-దుర్గా బెనర్జీ» వైమానిక దళంలో పైలట్‌గా పనిచేసిన తొలి భారతీయ మహిళ-హరితాకౌర్ దయాల్ » మొదటి భారతీయ ఎయిర్ మార్షల్-అర్జున్ సింగ్» వైమానిక దళ తొలి మహిళా ఎయిర్ వైస్ మార్షల్-పద్మా బందోపాధ్యాయ» మొదటి వైమానిక దళాల ప్రధానాధికారి-ఎస్.కె. ముఖర్జి (1954 - 60)» మొదటి నావికా దళాల ప్రధానాధికారి వైస్ అడ్మిరల్-ఆర్.డి. కటారి (1958 - 62)» నావికా దళంలో మొదటి మహిళా వైస్ అడ్మిరల్-పునీతా అరోరా» సైనికా దళంలో తొలి మహిళా లెఫ్టినెంట్ జనరల్-పునీతా అరోరా» సైనిక దళాల మొదటి ప్రధానాధికారి-జనరల్ ఎమ్. రాజేంద్ర సింగ్ (1955)» తొలి ఫీల్డ్ మార్షల్ జనరల్-మానెక్ షా (1973)» స్వతంత్ర భారత మొదటి ఎయిర్ చీఫ్ ఎయిర్ మార్షల్-సర్ థామస్ ఎల్ మ్రిస్ట్ (1947 - 50)» స్వతంత్ర భారత తొలి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్-కె.ఎం. కరియప్ప (1949 - 53)» డబ్ల్యూహెచ్‌వో ఆరోగ్య సమావేశాలకు అధ్యక్షత వహించిన మొదటి మహిళ-రాజకుమారి అమృత కౌర్ (1950)» తొలి భారతీయ మహిళా వైద్యురాలు-కాదంబినీ గంగూలీ (1886)» పదవిలో ఉండగా మరణించిన ఏకైక స్పీకర్-జి.ఎం.సి. బాలయోగి» మొదటి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్-ఎస్.వి. కృష్ణమూర్తి (1952)» రాజ్యసభకు తొలి మహిళా డిప్యూటీ ఛైర్మన్-వయిలెట్ ఆల్వా (1962 - 69)» రాజ్యసభ మొదటి మహిళా సెక్రటరీ జనరల్-వి.ఎస్. రమాదేవి» మొదటి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్-అనంతశయనం అయ్యంగార్ (1952 - 56)» మొదటి మహిళా కేంద్రమంత్రి-రాజకుమారి అమృతకౌర్ (ఆరోగ్యశాఖ 1947 - 57)


» మొదటి విద్యాశాఖామంత్రి-మౌలానా అబుల్ కలాం ఆజాద్» తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి-ఆర్.కె. షుణ్ముగం చెట్టి (1947)» రాష్ట్రాల పరంగా తొలి మహిళా మంత్రి-విజయలక్ష్మీ పండిట్ (ఉత్తర ప్రదేశ్) » రాష్ట్రాలపరంగా మొదటి మహిళా స్పీకర్-షానోదేవి (హర్యానా)» సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పనిచేసినవారు-వై.వి. చంద్రచూడ్ (7 ఏళ్లకు పైగా)» సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తక్కువ కాలం పనిచేసినవారు-కె.ఎన్. సింగ్ (18 రోజులు)» మొదటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్-వి. నరహరి రావు» మొదటి అటార్నీ జనరల్-ఎం.సి. సెతల్‌వాడ్» మొదటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్-హెచ్.కె. కృపలాని» దేశంలో ఫ్రంట్ ప్రభుత్వాలకు శ్రీకారం చుట్టిన తొలి ప్రధాని-వి.పి. సింగ్» కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన ప్రధాని-మన్మోహన్ సింగ్» రఘుపతి వెంకయ్య అవార్డు పొందిన తొలి వ్యక్తి-ఎల్.వి. ప్రసాద్» టెంపుల్టన్ అవార్డు పొందిన తొలి భారతీయుడు-సర్వేపల్లి రాధాకృష్ణన్» రైట్ టు లైవ్‌లీ హుడ్ అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి-రూత్ మనోరమ


» ఎర్రకోటపై ఎక్కువసార్లు జాతీయ జెండాను ఎగరవేసిన తొలి ప్రధాని-జవహర్‌లాల్ నెహ్రూ (17 సార్లు)» తొలి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్-డాక్టర్ శాంతి స్వరూప్ భట్నాగర్» చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులైన తొలి వ్యక్తి-ఎన్. శ్రీనివాసరావు » జాతీయ సమగ్రతా మండలికి తొలి అధ్యక్షుడు-జవహర్‌లాల్ నెహ్రూ» జాతీయ భద్రతా మండలికి తొలి అధ్యక్షుడు-బ్రిజేష్ మిశ్రా» జాతీయ వినియోగదారుల కమిషన్ మొదటి ఛైర్మన్-జస్టిస్ వి. బాలకృష్ణ ఎరాడి


» తొలి కేంద్ర‌ న్యాయశాఖామంత్రి-డాక్టర్ అంబేద్కర్»తొలి కేంద్ర‌ కార్మిక శాఖామంత్రి-బాబూ జగ్‌జ్జీవన్ రామ్» తొలి కేంద్ర‌ రక్షణ శాఖామంత్రి-బల్‌దేవ్‌సింగ్ » తొలి కేంద్ర‌ హోంశాఖామంత్రి-సర్దార్ వల్లభాయ్ పటేల్» తొలి కేంద్ర‌ వ్యవసాయ శాఖామంత్రి-బాబూ రాజేంద్రప్రసాద్» తొలి కేంద్ర‌ ఆర్థికమంత్రి-ఆర్.కె. షణ్ముగం చెట్టి» ఉత్తర ధ్రువాన్ని చేరుకున్న తొలి వ్యక్తి-రాబర్ట్ పియరీ (1909)» దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి మహిళ-కరోలిన్ మికెల్‌సెన్ (1935)» దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి వ్యక్తి-అముండ్‌సెన్ (నార్వే, 1911)» దేశానికి అధ్యక్షురాలైన తొలి మహిళ-ఇసబెల్ పెరాన్ (అర్జెంటీనా, 1974)» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులు-టెన్సింగ్ నార్కే (భారత్), ఎడ్మండ్ హిల్లరీ (న్యూజిలాండ్) 1955» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి తల్లీకూతుళ్లు-చెరైల్ బర్ట్, సిక్కి (ఆస్ట్రేలియా, 2008)» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి దంపతులు-ఆండ్రిజ్, మరిజా స్ట్రీమ్‌ఫెల్జ్ (స్లోవేకియా)» ఎవరెస్ట్ శిఖరాన్ని ఆక్సిజన్ లేకుండా అధిరోహించిన తొలి వ్యక్తులు-పీటర్ హబెలర్ (ఆస్ట్రేలియా), రెన్‌హోల్డ్ మెస్నర్ (ఇటలీ)» ఎవరెస్ట్ శిఖరంపై అధిక సమయం గడిపిన తొలి వ్యక్తి-బాబూ చిరిషెర్పా» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి అతిపిన్న వయస్కురాలు-డిక్కిడోల్మ» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వికలాంగుడు-టామ్ విట్టేకర్» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి అంధుడు-ఎరిక్ విహెన్మియర్ (అమెరికా, 2001)» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ-జుంకోతాబి (జపాన్, 1975)» తొలి విశ్వసుందరి-ఆర్మికౌసెల (ఫిన్‌లాండ్, 1952)» తొలి ప్రపంచ సుందరి-కెర్‌స్టిన్ కికి హాకోన్సన్ (స్వీడన్, 1951)

» చంద్రుడిపై కాలు మోపిన తొలి వ్యక్తి-నీల్ఆర్మ్‌స్ట్రాంగ్ (అమెరికా 1969)» బ్రిటన్ మొదటి ప్రధాని-రాబర్ట్ వాల్‌పోల్ (1721)» బ్రిటన్ మొదటి మహిళా ప్రధాని-మార్గరెట్ థాచర్ (కన్జర్వేటివ్ పార్టీ, 1979 - 90) » సముద్ర మార్గంలో ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి వ్యక్తి-ఫెర్టినాండ్ డిమాజిలాన్ (స్పెయిన్)» జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన తొలి మహిళ-ఆర్తి సాహా (భారత్)» జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన తొలి వికలాంగుడు-తారానాథ్ షెనాయ్ (1988)» అమెరికా మొదటి అధ్యక్షుడు-జార్జి వాషింగ్టన్ (1789)» రాజీనామా చేసిన మొదటి అమెరికా అధ్యక్షుడు-రిచర్డ్ నిక్సన్ (1974)


» హత్యకు గురైన మొదటి అమెరికా అధ్యక్షుడు-అబ్రహం లింకన్ (1865)» గ్రాండ్ స్లామ్ సాధించిన తొలి మహిళ-మౌరీన్ క్యాథరిన్ (1953)» మొదటి ప్రపంచ చెస్ ఛాంపియన్-విల్‌హెల్మ్ స్టెయిన్ట్జ్ (1886) » ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న తొలి మహిళ-చార్లొట్టే కూపర్ (యూకే టెన్నిస్, 1900)» జర్మనీ మొదటి మహిళా ఛాన్సెలర్-ఎంజెలా మెర్కెల్ (2005)


» దక్షిణాఫ్రికా అధ్యక్షుడైన తొలి నల్ల జాతీయుడు-నెల్సన్ మండేలా (1994)» అమెరికాకు అధ్యక్షుడైన తొలి నల్ల జాతీయుడు-బరాక్ హుస్సేన్ ఒబామా» తొలి మహిళా బిషప్-రీవ్ బార్బరా సి హ్యారీస్ (1988, అమెరికా) » అంతరిక్షంలోకి పంపిన తొలి జీవి-లైలా అనే కుక్క (స్పుత్నిక్ - 2, 1957)» అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి అమెరికా వ్యోమగామి-అలెన్ షెపర్డ్ (1961)


» అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి-యూరీ గగారిన్ (సోవియట్ యూనియన్ 1961)» అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ-వాలెంటీనా తెరిష్కోవా (యూఎస్ఎస్ఆర్, 1963)» అంతరిక్షంలో నడిచిన తొలి వ్యక్తి-అలెక్సి లియనోవ్ (యూఎస్ఎస్ఆర్, 1965) » అంతరిక్షంలో నడిచిన తొలి మహిళ-స్వెత్లానా సవిత్సకయ (యూఎస్ఎస్ఆర్, 1982)» అంతరిక్షంలో పర్యటించిన తొలి స్పేస్ టూరిస్ట్-డెన్నిస్ టిటో (అమెరికా, 2001)» అంతరిక్షంలో పర్యటించిన తొలి మహిళా టూరిస్ట్-అనౌషి అన్సారి (2006)» అంతరిక్షంలోకి వెళ్లిన తొలి ముస్లిం మహిళ-అనౌషి అన్సారి (2006)» ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు పొందిన తొలి వ్యక్తి-ఎమిల్ జెన్నింగ్స్ (1928)» ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు పొందిన తొలి నల్ల జాతీయురాలు-హాలీ బెర్రి (2002)» ఓడపై ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి వ్యక్తి-ఫెర్డినాండ్ మాజిలాన్ (స్పెయిన్)» పులిట్జర్ బహుమతి పొందిన తొలి నల్లజాతీయురాలు-జి.బ్రూక్స్ (1950)» ఐక్యరాజ్యసమితి తొలి సెక్రెటరీ జనరల్-ట్రిగ్వేలీ (నార్వే, 1946 - 53)» ఐక్యరాజ్యసమితి తొలి డిప్యూటీ సెక్రెటరీ జనరల్-లూయిస్ ఫ్రీ చెట్టి» గ్రాడ్యుయేట్ అయిన తొలి మూగ, చెవిటి మహిళ-హెలెన్ కెల్లర్ (1904)


» అంటార్కిటిక్ వలయాన్ని దాటిన తొలి వ్యక్తి-జేమ్స్ కుక్ (1773)» ప్రపంచంలో అన్ని ఖండాల్లోని ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ-అన్నా బిల్లీబెండ్ » ఇంగ్లిష్ ఛానెల్ ఈదిన తొలి వ్యక్తి-మాథ్యువెబ్ (1875)» తొలి టెస్ట్‌ట్యూబ్ బేబి-లూయిస్ బ్రౌన్ (1978, ఇంగ్లండ్)» గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించిన తొలి వ్యక్తి-క్రిస్టియన్ బెర్నార్డ్ (1967, దక్షిణాఫ్రికా)» భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి-విలియం రాంట్‌జన్ (1901, జర్మనీ)» రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి-జాకబ్స్ వాంట్ హాప్ (1901, నెదర్లాండ్స్)» వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి-ఎమిల్ అడాల్ఫ్ వాన్ బేరింగ్ (1901, జర్మనీ)» ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తులు-రాగ్నర్ ఫ్రిష్ (నార్వే), జాన్ టిన్ బెర్జెన్ (నెదర్లాండ్స్) 1969» నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి వ్యక్తులు-జీన్ హెన్రీ డ్యునాంట్ (స్విస్), ఫ్రెడరిక్ పాసీ (ఫ్రాన్స్)» సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి-సల్లీప్రుదోమ్మి (ఫ్రాన్స్, 1901)» నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి నల్లజాతీయుడు-రాల్ఫ్ బంచె (1950)


» రెండుసార్లు నోబెల్ బహుమతి అందుకున్న తొలి వ్యక్తి-మేరీ క్యూరి (భౌతికశాస్త్రం (1903), రసాయన శాస్త్రం (1911))» నోబెల్ శాంతి బహుమతి పొందిన మొదటి ముస్లిం మహిళ-షిరిన్ ఎబాది (ఇరాన్, 2003)» అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ-రోజాలిన్ హిగ్గిన్స్ » జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ మొదటి ఛైర్మన్-సూరజ్ భాను» జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ మొదటి ఛైర్మన్-కున్వర్ సింగ్» జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ మొదటి ఛైర్మన్-ఆర్.ఎన్. ప్రసాద్» జాతీయ మైనారిటీల కమిషన్ మొదటి ఛైర్మన్-జస్టిస్ ఎం.డి. సర్దార్ అలీఖాన్» జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ మొదటి ఛైర్మన్-శాంతా సిన్హా» జాతీయ మానవ హక్కుల కమిషన్ మొదటి ఛైర్మన్-జస్టిస్ రంగనాథ్ మిశ్రా» వయోపరిమితి సమస్య ఎదుర్కొన్న తొలి సైనిక దళాల ప్రధాన అధికారి-జనరల్ వి.కె. సింగ్» 1987లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి యుద్ధ ట్యాంకు-వైజయంతి» భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి పైలట్ రహిత యుద్ధ విమానం-నిశాంత్» భారత నావికాదళంలో తొలి యుద్ధ నౌక-ఐఎన్ఎస్ సావిత్రి» ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి యుద్ధ నౌక-ఐఎన్ఎస్ తరంగిణి» భారత్‌లో తొలి విమాన వాహక నౌక-ఐఎన్ఎస్ విశ్రాంత్» మన దేశ తొలి గూఢచార నౌక-ఐఎన్ఎస్ శివాలిక్» స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన దేశ తొలి క్షిపణి నౌక-ఐఎన్ఎస్ విభూతి» దేశీయ పరిజ్ఞానంతో తయారైన తొలి సబ్‌మెరైన్-ఐఎన్ఎస్ షల్కి» భారత దేశ తొలి అణు సబ్‌మెరైన్-ఐఎన్ఎస్ చక్ర» స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి అణు జలాంతర్గామి-అరిహంత్ (2009)» మన దేశ తొలి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం-భాస్కర - 1» ప్రపంచంలోనే తొలిసారిగా సముద్ర పరిశోధనలకు ప్రయోగించిన ఉపగ్రహం-ఓషన్‌శాట్ - 1» చంద్రుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం-చంద్రయాన్ - 1» సింగపూర్ తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం-ఎక్సోశాట్» జీఎస్ఎల్వీ శ్రేణిలో మొదటి నౌక-జీఎస్ఎల్వీ - డీ1» స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి క్షిపణి-పృథ్వీ» గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉన్న తొలి క్షిపణి-అగ్ని-2» భారతదేశ తొలి ఖండాంతర క్షిపణి-సూర్య» భారతదేశ తొలి అణు పరిశోధనా కేంద్రం-బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బీఏఆర్‌సీ)» భారతదేశ తొలి ప్రయోగాత్మక భూపరిశీలన ఉపగ్రహం-భాస్కర - 1» భారతదేశ తొలి జియో స్టేషనరీ ఉపగ్రహం-ఆపిల్» అమెరికా తొలి రోదసి నౌక-ఎక్స్‌ప్లోరర్» మనదేశంలో తొలి ఎఫ్.ఎం. స్టేషన్ ప్రారంభమైన నగరం-చెన్నై (1977)» ప్రైవేటు రంగంలో తొలి ఎఫ్.ఎం. ప్రారంభమైన నగరం-బెంగళూరు (2001)